Thalliki Vandhanam: ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల చదువులకు సంబంధించి అమలు చేస్తున్న తల్లికి వందనం డబ్బులు లబ్ధిదారుల్లో ఖాతాల్లో వేగంగా వేలాదిగా జమ అవుతున్నాయి. ఏకంగా ఒక్క రోజునే వారి ఖాతాల్లో సీఎం చంద్రబాబు ప్రభుత్వం రూ.10 వేల కోట్లు వేయడం విశేషం. రాష్ట్రంలో ఉన్న తల్లుల ఖాతాల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15వేలు అందిస్తున్నారు. ఇందులో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.13వేలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.2వేలను కలెక్టర్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. తల్లికి వందనం కింద 67 లక్షల మంది విద్యార్థులకు రూ. 10,091 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
ఇద్దరు పిల్లలు ఉన్న లబ్దిదారుడికి రూ.26 వేలు ఖాతాలో పడ్డాయి. రూ.4 వేలు పాఠశాల ఖాతాలో పడ్డాయి. నలుగురు పిల్లలున్న తల్లికి రూ.52వేలు, పాఠశాలల ఖాతాలో రూ.8వేలు జమ చేశారు. అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద పిల్లలకు కొత్త పుస్తకాలు, యూనిఫారం, బెల్ట్, బూట్లు, సాక్సులు పిల్లలకు అందజేశారు.