విధాత: రూపాయి పతనంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నిస్తే.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆయన హిందీ భాషపై వ్యంగ్యంగా స్పందించి విమర్శల పాలయ్యారు. విపక్ష సభ్యులు వాస్తవాలు మాట్లాడితే పార్లమెంటులో మైకులు కట్ చేయడం, ఎనిమిదన్నరేళ్లుగా బీజేపీ నేతలు గత వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం పరిపాటిగా మారింది. ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేని వారే ఎదురుదాడి చేస్తారు. ఈ విషయం బీజేపీ నేతలను చూస్తే అర్థమౌతుందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.
గతంలో రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై పార్లమెంటులో మాట్లాడితే వాళ్ల వాట్సప్ వర్సిటీ ద్వారా ఆయనను పప్పు అని వ్యంగ్యంగా చిత్రిస్తూ విష ప్రచారం చేశారు. నిన్న లోక్‌సభలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సరిగాలేదని కేంద్రం ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆమె పప్పు ప్రస్తావన తెచ్చారు.
Befitting reply by TMC MP @MahuaMoitra to Finance Minister @nsitharaman.