విధాత: కేంద్ర ఎన్నికల సంఘం పార్టీల హోదా గుర్తింపులో కీలక నిర్ణయాలు ప్రకటించింది. CPI, TMC, NCP పార్టీలకు జాతీయ హోదా రద్దు చేసింది. కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కల్పించింది. BRS తెలంగాణలో రాష్ట్ర పార్టీగా కొనసాగుతుందని ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ లో BRS రాష్ట్ర పార్టీ గుర్తింపును ఎన్నికల సంఘం తొలగించింది. ఎన్నికల సంఘం తాజా ప్రకటనతో జాతీయ పార్టీగా ఎదగాలన్న బిఆర్ఎస్ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. ప్రస్తుతం దేశంలో ఆరు పార్టీలు మాత్రమే జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయని ఎన్నికల సంఘం వెల్లడించింది.