MEDAK: TNGO సంఘం డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ

ఉద్యోగుల సంక్షేమంపై CM KCRకు ప్రత్యేక శ్రద్ధ: ఎమ్మెల్యే పద్మా రెడ్డి సకాలంలో జీతాలు ఇవ్వాలని సీఎంను కోరాం.. టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: ఉద్యోగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. టీఎన్‌జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి […]

  • Publish Date - January 12, 2023 / 04:26 PM IST
  • ఉద్యోగుల సంక్షేమంపై CM KCRకు ప్రత్యేక శ్రద్ధ: ఎమ్మెల్యే పద్మా రెడ్డి
  • సకాలంలో జీతాలు ఇవ్వాలని సీఎంను కోరాం.. టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల

విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: ఉద్యోగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. టీఎన్‌జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్, టీఎస్పీఎస్సీ మెంబర్ కారం రవీందర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ రమేష్, టిఎన్జీవో రాష్ట్ర మాజీ అధ్యక్షులు జి దేవి ప్రసాద్ రావు స్థానిక సంఘ భవనంలో గురువారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు.ఉద్యోగుల సమస్యల పరిష్కారం సీఎం కేసీఆర్ తోనే సాధ్యమన్నారు. సంఘ భవనానికి ఏడుపాయల దేవస్థానం ఆవరణలో స్థలం కేటాయించడంతోపాటు కొత్త యూనిట్ల సంఘ భవనాల నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.

టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ మాట్లాడుతూ సమస్యలపై సీఎం ఆదేశాలు ఇచ్చిన అమలు చేయడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయడం­తో పాటు మూడు డీఏలు మంజూరు చేయాలని, ఉద్యోగు­లకు సకాలంలో జీతాలు ఇవ్వాలని, 317 జీవోతో బదిలీపై వెళ్లిన భార్యాభర్తల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

ఈహెచ్​ ఎస్​ స్కీం 2018 నుంచి అమల్లో కుంటుపడిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగుల నగదు రహిత ఆరోగ్య సేవల పథకానికి మూల వేతనం నుంచి ప్రతి నెలా తమ వాటాగా రెండు శాతం మొత్తాన్ని కంట్రిబ్యూషన్‌గా చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంటాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సర్కార్ చర్యలు చేపట్టాలన్నారు. అర్హులైన ఉద్యోగులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చిన విధంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సహకరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మినికి రాజ్ కుమార్ తోపాటు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్,షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి,డీఏవో తోట కుమార్,టీఎన్జీవో మాజీ అధ్యక్షులు మేడిశెట్టి శ్యామ్ రావు,కోశాధికారి బట్టి రమేష్, ఉపాధ్యక్షులు గాండ్ల అనురాధ, మంగ మనోహర్,ఫణి రాజ్, ఎండి ఇక్బాల్ పాషా,ఎంకెటి అర్షద్,ఎండి.ఫజులుద్దీన్, సంయుక్త కార్యదర్శులు పోతురాజు శంకర్, టి.రాధా, కార్యాలయ కార్యదర్శి కోటి రఘునాథరావు,జిల్లా కార్యవర్గ సభ్యులు లీల,విష్ణువర్ధన్ రెడ్డి, మెదక్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు పంపరి శివాజీ, రామా గౌడ్ నర్సాపూర్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు కే శేషాచారి,రాకేష్, రామాయంపేట యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు అనుముల ప్రభాకర్, నిఖిల్ శ్రీనివాస్,ఏడుపాయల వనదుర్గ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు సూర్య శ్రీనివాస్, ప్రశాంత్,చేగుంట యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు అశోక్ రెడ్డి, విజయ్, తూప్రాన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్, జయభారత్ రెడ్డి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి గౌడ్,మొగులయ్య పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు నగేష్, నర్సింలు పశుసంవర్ధక శాఖ ఫోరం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోపాల్, సలావుద్దీన్, సహకార శాఖ ఫోరం కార్యదర్శి సంగమేశ్వర్, మెడికల్ ఫోరం కార్యదర్శి మంజుల, గ్రంథాలయ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు శంకర్, గణేష్, హెచ్ డబ్ల్యు ఓ ఫోరం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, మున్సిపల్ ఫోరం కార్యదర్శి హర్షద్, టీఎన్జీవో నాయకులు మెర్సిన,మరియా,ప్రవీణ్, డిపిఎం సురేష్, జిల్లాలోని ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.