Today Rasi Phalalu | ఈరోజు దిన ఫలాలు (15.06.2023).. ఆ రాశుల వారికి వృత్తిపరంగా ఇబ్బందులు, అనుకోని ఖర్చులు

Today Rasi Phalalu | దిన ఫలాలు | (చంద్రచారము ఆధారంగా) తేదీ: 15.06.2023; చంద్రచారము 20.28 గంటల వరకు మేషరాశి, తదుపరి వృషభరాశి. మేష రాశి: చంద్రుడు 20.28 గంటల వరకు 1వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో సానుకూల సందర్భాలు నెలకొంటాయి. తదుపరి 2వ ఇంటకు మారుతున్నందున స్వల్ప నష్టాలు, సమస్యలతో మనసు వేదనతో ఉండొచ్చు. వృషభ రాశి: చంద్రుడు 20.28 గంటల వరకు 12వ ఇంట ఉంటున్నందున వృత్తిపరమైన రంగాల్లో […]

  • Publish Date - June 15, 2023 / 01:39 AM IST

Today Rasi Phalalu | దిన ఫలాలు | (చంద్రచారము ఆధారంగా)

తేదీ: 15.06.2023; చంద్రచారము 20.28 గంటల వరకు మేషరాశి, తదుపరి వృషభరాశి.

మేష రాశి: చంద్రుడు 20.28 గంటల వరకు 1వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో సానుకూల సందర్భాలు నెలకొంటాయి. తదుపరి 2వ ఇంటకు మారుతున్నందున స్వల్ప నష్టాలు, సమస్యలతో మనసు వేదనతో ఉండొచ్చు.

వృషభ రాశి: చంద్రుడు 20.28 గంటల వరకు 12వ ఇంట ఉంటున్నందున వృత్తిపరమైన రంగాల్లో వారికి కొన్ని సమస్యల కారణంగా అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉన్నది.

తదుపరి చంద్రుడు 20.28 గంటల నుంచి 1వ ఇంటకు మారుతున్నందున ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నది.

మిథున రాశి: చంద్రుడు 20.28 గంటల వరకు 11వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది.

తదుపరి చంద్రుడు 20.28 గంటల నుంచి 12వ ఇంటకు మారుతున్నందున వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులతో అనుకోని ఖర్చులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తున్నది.

కర్కాటక రాశి: చంద్రుడు 20.28 గంటల వరకు 10వ ఇంట ఉంటున్నందున ఆర్థిక విషయాలతో పాటు.. వృత్తి, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో సాఫల్యాలు చోటు చేసుకుంటాయి.

తదుపరి 11వ ఇంటకు మారుతున్నందున వృత్తి, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది.

సింహ రాశి: చంద్రుడు 20.28 గంటల వరకు 9వ ఇంట ఉండటం ప్రతికూల ప్రభావాలను కలుగజేయవచ్చు. స్వల్ప నష్టాలు, కుటుంబపరమైన ఇబ్బందులతో మనసు వేదనతో, దిగులుతో ఉండొచ్చు.

తదుపరి చంద్రుడు 20.28 గంటల నుంచి 10వ ఇంటకు మారుతున్నందున ఆర్థిక, వృత్తి, వ్యాపార రంగాల్లో చెప్పుకోతగిన మార్పులు చోటుచేసుకుంటాయి.

కన్యా రాశి: చంద్రుడు 20.28 గంటల వరకు 8వ ఇంట ఉంటున్నందున కొన్ని ఆర్థిక నష్టాలు, ఇబ్బందులు, టెన్షన్ల కారణంగా స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది.

తదుపరి చంద్రుడు 9వ ఇంటకు మారుతున్నదున కొన్ని స్వల్ప నష్టాలు, సమస్యలతో మనసు వేదనతో, విచారంతో నిండి ఉండొచ్చు.

తులా రాశి: చంద్రుడు 20.28 గంటల వరకు 7వ ఇంట ఉంటున్నందున ఈ రాశివారు ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో సాఫల్యాలను ఆశించవచ్చు.

తదుపరి చంద్రుడు 20.28 గంటల నుంచి 8వ ఇంటకు మారుతున్నందున ఆర్థిక నష్టాలు, ఇబ్బందులు, టెన్షన్లతో చిన్నపాటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నది.

వృశ్చిక రాశి: చంద్రుడు 20.28 గంటల వరకు 6వ ఇంట ఉంటున్నందున గృహ, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో చెప్పుకోతగిన మార్పులు కనిస్తాయి.

తదుపరి చంద్రుడు 7వ ఇంటకు మారుతున్నందున గృహ, ఆరోగ్య, కుఉటంబ విషయాల్లో మెరుగుదలను ఆశించవచ్చు.

ధనూ రాశి: చంద్రుడు 20.28 గంటల వరకు 5వ ఇంట ఉండటం ప్రతికూల ప్రభావాలను కలుగజేసే అవకాశం ఉన్నది. స్వల్ప నష్టాలు, సమస్యలతో టెన్షన్‌ అనుభవించే అవకాశం ఉన్నది.

తదుపరి చంద్రుడు 20.28 గంటల నుంచి ఆరవ ఇంటకు మారుతున్నందున ఆర్థిక విషయాలతోపాటు.. ఆరోగ్య, కుటుంబ అంశాల్లోనో చెప్పుకోతగిన మార్పులు గమనిస్తారు.

మకర రాశి: చంద్రుడు 20.28 గంటల వరకు 4వ ఇంట ఉంటున్నందున కొన్ని నష్టాలు, కుటుంబ తగాదాలతో విభేదాలు, శత్రుత్వాలు నెలకొనే అవకాశం ఉన్నది.

తదుపరి 5వ ఇంటకు మారుతున్నందున కొన్ని నష్టాలు, కుటుంబ సమస్యలు కొనసాగి మానసికంగా టెన్షన్‌కు గురయ్యే అవకాశం ఉన్నది.

కుంభ రాశి: చంద్రుడు 20.28 గంటల వరకు 3వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో మెరుగుదల కనిపిస్తుంది.

తదుపరి 4వ ఇంటకు మారుతున్నందున స్వల్ప నష్టాలు, సమస్యలతో విభేదాలు, శత్రుత్వాలు కలిగే ఆస్కారం ఉన్నది.

మీన రాశి: చంద్రుడు 20.28 గంటల వరకు 2వ ఇంట ఉంటున్నందున వృత్తిపరంగా కొన్ని సమస్యలు, స్వల్ప నష్టాలతో మనసు టెన్షన్‌తో, దిగులుతో ఉంటుంది.

తదుపరి చంద్రుడు 3వ ఇంటకు మారుతున్నందున ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో సానుకూల సందర్భాలు నెలకొంటాయి.