Gold Rate | బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. మార్కెట్‌లో శనివారం బంగారం ధరలు పతనమయ్యాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.200 తగ్గగా తులానికి రూ.54,850కి చేరింది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.210 వరకు తగ్గి.. రూ.59,840కి చేరింది.
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.59,940 వద్ద కొనసాగుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.54,850 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.59,840 వద్ద కొనసాగుతున్నది.
చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,110కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.54,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,840 చేరింది.
ఏపీలోని తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండిపై కిలోకు రూ.1000 వరకు పెరిగి కిలోకు రూ.75,500 పలుకుతున్నది.
హైదరాబాద్‌లో కిలో వెండి రూ.79వేలకు చేరింది. మరో వైపు ప్లాటినం ధరలు సైతం స్వల్పంగా పెరిగాయి. రూ.10 పెరిగి తులం రూ.24,640 పలుకుతున్నది.