విధాత : నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి వద్ద బీబీనగర్-నడికుడి రైల్వే ట్రాక్‌పై ఓ రైతు ట్రాక్టర్ ఇరుక్కుని ఆగిపోవడంతో ఆ మార్గంలో వెలుతున్న పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను అరగంట పాటు నిలిపివేశారు.
మాడ్గులపల్లి రైతు చెన్నయ్య ట్రాక్టర్‌లో కట్టెలు తీసుకుని పట్టాలను దాటే క్రమంలో ట్రాక్ కంకరలో టైర్ ఇరుక్కుపోయి ఆగిపోయింది. దీంతో గుంటూరు నుంచి హైద్రాబాద్ వెలుతున్న పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను కుక్కడం రైల్వే స్టేషన్‌లో అధికారులు నిలిపివేశారు. జేసీబీ సహాయంతో ట్రాక్టర్‌ను పట్టాల మీద నుంచి తొలగించాక పల్నాడు రైలు ముందుకు అనుమతించారు.