2 డ్రోన్లు, కిలో హెరాయిన్ స్వాధీనం

పంజాబ్‌ అమృత్‌సర్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో రెండు డ్రోన్‌లు, దాదాపు ఒక కిలో హెరాయిన్ మ‌త్తుప్ర‌దార్ధంను స్వాధీనం.

  • Publish Date - December 19, 2023 / 06:34 AM IST
  • పంజాబ్ అమృత్‌స‌ర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో సీజ్‌



విధాత‌: పంజాబ్‌ అమృత్‌సర్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో రెండు డ్రోన్‌లు, దాదాపు ఒక కిలో హెరాయిన్ మ‌త్తుప్ర‌దార్ధం ను స్వాధీనం చేసుకున్నట్టు బీఎస్‌ఎఫ్ అధికార ప్రతినిధి మీడియాకు వెల్ల‌డించారు. మంగళవారం తెల్లవారుజామున అమృత్‌సర్‌లోని ధనోయ్ ఖుర్ద్ గ్రామ సమీపంలో డ్రోన్‌ను గుర్తించిన‌ట్టు తెలిపారు.


పంజాబ్ పోలీసులతో కలిసి జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో ఒక పొలంలో చైనా తయారు చేసిన డ్రోన్, 430 గ్రాముల బరువున్న హెరాయిన్ ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్న‌ట్టు తెలిపారు. ప్యాకెట్‌కు నైలాన్ రింగ్, చిన్న టార్చ్ కూడా ఉన్న‌ట్టు పేర్కొన్నారు.


సోమవారం సాయంత్రం అదే ధనోయ్ ఖుర్ద్ గ్రామంలో బీఎస్ఎఫ్ దళాలు మరో డ్రోన్‌ను గుర్తించిన‌ట్టు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్‌లో చైనా తయారు చేసిన క్వాడ్‌కాప్టర్, 540 గ్రాముల బరువున్న హెరాయిన్ ప్యాకెట్ స్వాధీనం చేసుకున్న‌ట్టు బీఎస్ఎఫ్‌ అధికార ప్రతినిధి వివ‌రించారు.