Antonio Guterres | లింగ సమానత్వం సాధించేందుకు ఇంకా 300 ఏళ్లు పడుతుంది : యూఎన్‌ సెక్రెటరీ జనరల్‌ గుటెర్స్

Antonio Guterres | లింగ సమానత్వంపై ఐక్యరాజ్యసమితి (UN) సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా వారి స్థితిగతులపై స్పందించారు. లింగ సమానత్వం దిశగా సాగుతున్న పురోగతి మన కళ్ల ముందే కనుమరుగైపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత అంచనాల ప్రకారం.. లింగ సమానత్వం సాధించేందుకు ప్రపంచానికి ఇంకా 300 సంవత్సరాలుపడుతుందన్నారు. మాతాశిశు మరణాల రేటు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఆడపిల్లలకు చిన్న వయసులోనే బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారన్నారు. బాలికలను […]

  • Publish Date - March 9, 2023 / 04:38 AM IST

Antonio Guterres | లింగ సమానత్వంపై ఐక్యరాజ్యసమితి (UN) సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా వారి స్థితిగతులపై స్పందించారు. లింగ సమానత్వం దిశగా సాగుతున్న పురోగతి మన కళ్ల ముందే కనుమరుగైపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత అంచనాల ప్రకారం.. లింగ సమానత్వం సాధించేందుకు ప్రపంచానికి ఇంకా 300 సంవత్సరాలుపడుతుందన్నారు. మాతాశిశు మరణాల రేటు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఆడపిల్లలకు చిన్న వయసులోనే బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారన్నారు. బాలికలను పాఠశాలలకు వెళ్లనీయకుండా కిడ్నాప్‌లు చేసి దాడులు చేస్తున్నారని, లింగ సమానత్వం సాధించాలనే ఆశ నానాటికీ దూరమవుతోందనడానికి ఇదే నిదర్శనమన్నారు.

అయితే, ఆయన పరోక్షంగా ఇరాన్‌ గురించే వ్యాఖ్యానించగా.. ప్రసంగంలో ఎక్కడా ఇరాన్‌ పేరును ప్రస్తావించలేదు. డిసెంబర్‌ హిజాబ్‌ వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్న యువతి పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఆఫ్ఘనిస్తాన్‌ సహా కొన్ని దేశాల గురించి ప్రస్తావిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులు దుర్వినియోగమవుతున్నాయని, ఉల్లంఘనలు జరుగుతున్నాయని, బాలికలను ప్రజా జీవితానికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూఎన్‌ వుమెన్‌ డిప్యూటీ సెక్రెటరీ జనరల్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇటీవల ఆఫ్ఘన్‌లో పర్యటించి.. మహిళల, బాలికలకు మద్దతుగా తాము పోరాటాన్ని ఎప్పటికీ ఆపబోమని తాలిబన్‌ అధికారులకు చెప్పినట్లు ఆంటోనియో గుటెర్స్ తెలిపారు.

షాకింగ్‌కు గురి చేస్తున్న యూఎన్‌ రిపోర్ట్‌

తాజాగా ఐక్యరాజ్యసమితి ఓ నివేదికను విడుదల చేసింది. ఈ అధ్యయనం నివేదిక ప్రకారం, కొవిడ్‌ మహమ్మారి, హింసాత్మక సంఘర్షణ, వాతావరణ మార్పులతో సహా ప్రపంచ సంక్షోభాల నేపథ్యంలో లింగ అసమానతలు తీవ్రమవుతున్నాయి. మహిళల లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం హక్కులపై దాడులతో పరిస్థితి మరింత సవాల్‌గా మారింది. 2030 నాటికి దేశాలో ఐదో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం సాధ్యంకాకపోవడానికి ఇదే కారణం. 2030కి చేరువవుతున్న సమయంలో మహిళల హక్కులు, లింగ సమానత్వం ఓ మైలురాయి. బాలికల పురోగతిని వేగవంతం చేసేందుకు కలిసిపని చేయడానికి పెట్టుబడి కీలకం. అయితే, ఈ గణంకాలు వారి జీవితాల్లో తిరోగమనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రపంచంలో నెలకొన్న సంక్షోబం కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. ఆదాయం, భద్రత, విద్య, ఆరోగ్యం విషయంలో పరిస్థితి రివర్స్‌ అయ్యింది. ఈ విషయంలో ఇంకా ఆలస్యం చేస్తే మరింత ఖర్చు అవుతుందని నివేదిక పేర్కొంది.

Latest News