Ural Airlines | పొలాల్లో విమానం ఎమ‌ర్జ‌న్సీ ల్యాండింగ్‌.. 159 మంది సేఫ్‌

Ural Airlines విధాత‌: ర‌ష్యాలో ఓ విమానానికి పెను ప్ర‌మాదం త‌ప్పింది. గాల్లో ఉండ‌గా సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో పైల‌ట్ ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌కు సిద్ధ‌ప‌డ్డారు. దీంతో ఆ విమానాన్ని సైబీరియాలో సుర‌క్షితంగా పంట పొలాల్లో ల్యాండ్ చేశారు. ర‌ష్యా సంస్థ ఉర‌ల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం సోచీ నుంచి ఓమ్స్‌కు వెళుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో సుమారు 159 మంది ప్ర‌యాణిస్తున్న‌ట్లు స‌మాచారం. ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న స‌హాయ సిబ్బంది ఎమ‌ర్జెన్సీ మార్గంలో ప్ర‌యాణికుల‌ను కింద‌కి దించేశారు. […]

  • Publish Date - September 12, 2023 / 01:48 PM IST

Ural Airlines

విధాత‌: ర‌ష్యాలో ఓ విమానానికి పెను ప్ర‌మాదం త‌ప్పింది. గాల్లో ఉండ‌గా సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో పైల‌ట్ ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌కు సిద్ధ‌ప‌డ్డారు. దీంతో ఆ విమానాన్ని సైబీరియాలో సుర‌క్షితంగా పంట పొలాల్లో ల్యాండ్ చేశారు. ర‌ష్యా సంస్థ ఉర‌ల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం సోచీ నుంచి ఓమ్స్‌కు వెళుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇందులో సుమారు 159 మంది ప్ర‌యాణిస్తున్న‌ట్లు స‌మాచారం. ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న స‌హాయ సిబ్బంది ఎమ‌ర్జెన్సీ మార్గంలో ప్ర‌యాణికుల‌ను కింద‌కి దించేశారు. అనంత‌రం వారిని బ‌స్సుల్లో అక్క‌డి నుంచి ద‌గ్గ‌ర్లోని హోట‌ళ్ల‌కు త‌ర‌లించారు. విమానంలో త‌లెత్తిన స‌మ‌స్య‌ల గురించి గానీ.. గాయాల‌పాలైన ప్ర‌యాణికుల గురించి కానీ అధికారులు ఎటువంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు.