బాలకృష్ణతో చర్చించే ఆ సీన్ తీశా: దర్శకుడు గోపిచంద్‌

veera simha reddy నందమూరి బాలకృష్ణ సినిమాలంటే యాక్షన్ సీన్స్ కాస్త ఓవర్‌గా ఉంటాయి. చిటికేస్తే కుర్చి వచ్చి ఆయన దగ్గర కూర్చోవడానికి అనుకూలంగా మారుతుంది. చిటికేసి కనుసైగ చేస్తే రైలు కూడా ఆగిపోతుంది. ఇలా ఈయన చిత్రాలలోని యాక్షన్ సీన్స్ మరి ఓవర్గా గ్రావిటీ వంటి సైన్స్ కు విరుద్ధమైన సీన్స్ తో నిండి ఉంటాయి. అందుకే బాలయ్య చిత్రాలను కోలీవుడ్‌లో విజయ్ కాంత్ చిత్రాలను పోలుస్తూ వాటిలోని యాక్షన్ సీన్స్ ను పలువురు ట్రోల్స్ […]

  • Publish Date - January 23, 2023 / 07:49 AM IST

veera simha reddy

నందమూరి బాలకృష్ణ సినిమాలంటే యాక్షన్ సీన్స్ కాస్త ఓవర్‌గా ఉంటాయి. చిటికేస్తే కుర్చి వచ్చి ఆయన దగ్గర కూర్చోవడానికి అనుకూలంగా మారుతుంది. చిటికేసి కనుసైగ చేస్తే రైలు కూడా ఆగిపోతుంది. ఇలా ఈయన చిత్రాలలోని యాక్షన్ సీన్స్ మరి ఓవర్గా గ్రావిటీ వంటి సైన్స్ కు విరుద్ధమైన సీన్స్ తో నిండి ఉంటాయి. అందుకే బాలయ్య చిత్రాలను కోలీవుడ్‌లో విజయ్ కాంత్ చిత్రాలను పోలుస్తూ వాటిలోని యాక్షన్ సీన్స్ ను పలువురు ట్రోల్స్ చేస్తూ ఉంటారు.

ఇక అఖండాలాంటి బాగా బ్లాక్ బస్టర్ తరువాత భారీ అంచనాలతో వీర‌సింహారెడ్డి బ‌రిలోకి దిగింది. సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్యతో పోటీ పడుతూ సూపర్ హిట్ కొట్టింది. క్రాక్ లాంటి హిట్ తర్వాత గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాలయ్య కెరీర్లో మైలు రాయిగా నిలిచిపోతుంది. మొదటి రోజు 52 కోట్లు వసూలు చేసి సరి కొత్త రికార్డును నెలకొల్పింది. సగటు అభిమాని బాలయ్యని ఎలా చూడాలనుకుంటున్నాడో అలా ఈచిత్రాన్ని తీసినట్లు కామెంట్స్ వస్తున్నాయి.

అయితే ఈ చిత్రంపై కొన్ని నెగటివ్ మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ కాలితో తంతే కారు వెనక్కి పోవడం సోషల్ మీడియాలో కామెడీని క్రియేట్ చేస్తోంది. అప్పట్లో పల్నాటి బ్రహ్మనాయుడు చిత్రంలో కూడా బాలయ్య చిటిక వేసి తొడగొడితే ఏకంగా ట్రైన్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది దేశవ్యాప్తంగా నవ్వులు పూయించిన సన్నివేశం.

ఇక వీర సింహారెడ్డిలోని సన్నివేశంపై దర్శకుడు గోపీచంద్ మల్లిని వివరణ ఇచ్చాడు. తాజాగా ఆయన సక్సెస్ ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతూ విరసింహారెడ్డి పాత్ర గొడ్డలితో కారు ముందు నిలబడినప్పుడు అందులో ఉన్నవాళ్లు రివర్స్ గేర్ వేసి వెనక్కి వెళ్లాలనుకుంటారు. అయితే కారు వెనుక చక్రం మట్టిలో కూరుకుని పోయి ఉంటుంది.

బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పిన తర్వాత కాలితో కారును తంతారు. దీంతో మట్టిలో దిగబడిపోయిన కారు టైరు పైకి లేస్తుంది. అప్పటివరకు కార్ రివర్స్ గేర్ లో ఉంది కదా అప్పుడు అది వెనక్కి వెళ్ళకుండా ముందుకు వస్తుందా మీరే చెప్పండి. దాని ట్రోల్స్ చేయాల్సిన అవసరం లేదు. మీమ్స్ చేసే వాళ్ళు రకరకాలుగా చేస్తారు. బాలకృష్ణతో చర్చించిన తర్వాతే ఈ సీన్ తీసానని చెప్పుకొచ్చాడు.