విధాత: నల్గొండ జిల్లాలో కొత్తగా వెటర్నరీ కళాశాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
రాజేంద్ర నగర్ లోని PV నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ఆవరణలో నూతనంగా 12.75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ ను సహచర మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/vDJSMSNjtx
— Talasani Srinivas Yadav (@YadavTalasani) November 29, 2022
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పీవీ. నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ఆవరణలో వెటర్నరీ క్లినిక్ కాంప్లెక్స్ ప్రారంభించిన సందర్భంగా తలసాని మాట్లాడారు.
రాష్ట్రంలో జీవాల సంఖ్యకు అనుగుణంగా పశువైద్యులను, యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే నల్గొండలో కొత్తగా వెటర్నరీ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు.
— Talasani Srinivas Yadav (@YadavTalasani) November 29, 2022