విధాత: వారం రోజుల కిందట ప్రత్యర్థుల ట్రోలింగుకు గురైన విజయసాయి రెడ్డి.. మళ్ళీ తన స్థానాన్ని తాను దక్కించుకుని టిడిపి సోషల్ మీడియా, ఇతర ప్రత్యర్థులకు సమాధానం చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి, ఇంకో ఏడుగురిని వైస్ చైర్మన్ ప్యానెల్ మెంబరుగా నియమించారంటూ లిస్ట్ రిలీజయింది.
అయితే మరునాడు అధికారిక ఉత్తర్వులు వచ్చేసరికి విజయసాయి పేరు మినహా మిగతా ఏడుగురు సభ్యులు మాత్రమే జాబితాలో ఉన్నారు. దీంతో ఆయన్ను టిడిపి సోషల్ మీడియాతో బాటు రెగ్యులర్.. డైలీ ప్రత్యర్థి రఘురామ కృష్ణం రాజు కామెంట్స్ విసిరారు.
మొత్తానికి ఆ వారం అలా ట్రోలింగుకు గురైన విజయసాయి మళ్ళీ అదే కమిటీలో చోటు సంపాదించారు. వాస్తవానికి రాజ్యసభకు ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహిస్తారు. ఆయన లేనిపక్షంలో సభను సజావుగా నడిపించడానికి ఎనిమిది మంది సభ్యుల ప్యానెల్ ఉంటుంది. ఆ సభ్యులంతా ఐక్యంగా సమన్వయంతో సభను నడిపిస్తారు.
ఇప్పుడు తాజాగా ఆ ప్యానెల్లో విజయసాయిరెడ్డితో పాటు ప్రముఖ క్రీడాకారిణి పీటీ ఉషను కూడా నియమించారు. ఈ మేరకు తాజా పార్లమెంటు సమావేశాల్లో రాజ్యసభలో జగదీప్ ధనకర్.. విజయసాయిరెడ్డి పేరును చదివి వినిపించారు.
కొద్ది రోజుల క్రితం విజయసాయిరెడ్డి పేరు తెరపైకి వచ్చినప్పటికీ ఆయన పేరును చదవలేదు. దీంతో ఈరోజు వారి పేర్లను అధికారికంగా ప్రకటించడంతో ట్రోలింగులకు ముగింపు పలికినట్లయింది. ప్రస్తుతం ప్యానెల్ వైస్ చైర్మన్లుగా..
1.భువనేశ్వర్ కాలితా
2.సుఖేందు శేఖర్ రే
3.డా. ఎల్.హనుమంతయ్య
4.డా.సస్మిత్ పాత్రా
5.తిరుచి శివ
6.సరోజ్ పాండే
7.సురేంద్ర సింగ్ సభ్యులుగా ఉన్నారు. తాజాగా పిటి ఉష, విజయసాయి రెడ్డి వచ్చి చేరారు.