Warangal
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్నో ఏళ్లుగా గిరిజన బిడ్డలు ఎదురుచూస్తున్న పోడు భూములకు పట్టాల కల ఈరోజు నెరవేరిందని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. నర్సంపేటలో ఆదివారం పట్టాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మంత్రి తో పాటు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, కలెక్టర్ ప్రావీణ్య, పిఓ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 7337 ఎకరాలలో పోడు భూములను సాగు చేసుకుంటున్న 3271 మంది రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉన్నంతకాలం కేసిఆర్ పాలన ఉంటుందన్నారు.
తెలంగాణకి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఇన్ని రోజులు పోడుభూమికి విలువలేదు కానీ నేడు పట్టా ఉన్న భూమికి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో రైతుబందు, రైతు భీమా లాంటి హక్కులు అన్ని ఈ పోడు భూములకు వర్తింపజేసినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో ODCMS చైర్మన్, జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, DRDA PD, RSS రాష్ట్ర డైరెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్లు, ఎంపిపిలు, జెడ్పిటిసిలు, జెడ్పి కోఆప్షన్ సభ్యులు, RSS కన్వీనర్లు, PACS చైర్మన్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO), తదితరులు పాల్గొన్నారు.