Warangal
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండలో బీజేపీ నేత, మాజీ మేయర్, డా. టి. రాజేశ్వర్ రావును మరియు రిటైర్డ్ సిఈ వేదిరె వెంకట్ రెడ్డిలను హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
గవర్నర్ రాక సందర్భంగా పలువురు బీజేపీ నేతలు అక్కడికి చేరుకుని సాదర స్వాగతం పలికారు. ఆయన వెంట బిజేపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర నాయకులు కన్నబోయిన రాజయ్య, మంద ఐలయ్య, నాగపూరి రాజమౌళి గౌడ్, గుజ్జ సత్యనారాయణ రావు, రావుల కిషన్, తోపుచేర్ల అర్చన మధు సూధన్, తీగల భరత్ గౌడ్, గుజ్జుల మహేందర్ రెడ్డి, కందగట్ల సత్యనారయణ, తదితరులు ఉన్నారు.