అర్ధ‌రాత్రి ల‌వ‌ర్ ఇంటికి.. బావిలో ప‌డ‌టంతో పెళ్లి..

విధాత: ఓ ఇద్ద‌రు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. ఈ క్ర‌మంలో ఆ జంట దొంగ‌చాటుగా అప్పుడ‌ప్పుడు క‌లుసుకుంటున్నారు. అయితే ఇటీవ‌ల ఓ రాత్రి త‌న ప్రేయ‌సిని క‌లుసుకునేందుకు అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఆమె ఇంటికి వ‌చ్చి బుక్క‌య్యాడు. ఆ త‌ర్వాత గ్రామ పెద్ద‌లు ద‌గ్గ‌రుండి వివాహం జ‌రిపించారు. వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్ చాప్రా జిల్లాలోని మోతిరాజ్‌పూర్ గ్రామానికి చెందిన మున్నా రాజ్ ఒక అమ్మాయిని కొంత‌కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. ఆ యువ‌తికి కూడా అత‌నికెంతో ఇష్టం. దీంతో […]

  • Publish Date - December 14, 2022 / 01:38 AM IST

విధాత: ఓ ఇద్ద‌రు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. ఈ క్ర‌మంలో ఆ జంట దొంగ‌చాటుగా అప్పుడ‌ప్పుడు క‌లుసుకుంటున్నారు. అయితే ఇటీవ‌ల ఓ రాత్రి త‌న ప్రేయ‌సిని క‌లుసుకునేందుకు అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఆమె ఇంటికి వ‌చ్చి బుక్క‌య్యాడు. ఆ త‌ర్వాత గ్రామ పెద్ద‌లు ద‌గ్గ‌రుండి వివాహం జ‌రిపించారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్ చాప్రా జిల్లాలోని మోతిరాజ్‌పూర్ గ్రామానికి చెందిన మున్నా రాజ్ ఒక అమ్మాయిని కొంత‌కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. ఆ యువ‌తికి కూడా అత‌నికెంతో ఇష్టం. దీంతో అప్పుడ‌ప్పుడు ఇద్ద‌రు క‌లుసుకునేవారు. దీంతో శ‌నివారం రాత్రి కూడా మున్నా రాజ్ త‌న ప్రేయ‌సి ఇంటికి వ‌చ్చాడు. అర్ధ‌రాత్రి 2 గంట‌ల స‌మ‌యంలో ఆమె ఇంట్లో శ‌బ్దాలు రావ‌డంతో కుటుంబ స‌భ్యుల‌కు మెల‌కువ చ్చింది.

ఈ క్ర‌మంలో రాజ్ అక్క‌డ్నుంచి ప‌రారీ అయ్యాడు. భ‌యంతో గ్రామ స‌మీపంలో ఉన్న బావిలో దూకాడు.
ఇక కుటుంబ స‌భ్యులు, గ్రామ‌స్తులంద‌రూ క‌లిసి బావిని చుట్టుముట్టి. మున్నాను బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. విష‌యం తెలుసుకున్న గ్రామ‌పెద్ద‌లు ఆ యువ‌కుడిని చేర‌దీశారు.

ఇరు కుటుంబాల స‌భ్యుల‌తో మాట్లాడారు. మున్నాకు, ఆమె యువ‌తికి ఇష్టం ఉండటంతో ఆదివారం రోజు స్థానికంగా ఉన్న ఆల‌యంలో వారికి వివాహం జ‌రిపించారు. ఈ సంద‌ర్భంగా ఆ నూత‌న జంట గ్రామ పెద్ద‌ల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపింది.