విధాత: నిజానికి తప్పు చేయనివాడు సృష్టిలో ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేసే ఉంటారు. అయితే ఆ తప్పులను గుర్తించి పశ్చాత్తాపం పొంది మరలా తప్పులు చేయకుండా ఉండాలని మన హిందూ పురాణాలతో పాటు బైబిల్ కూడా అదే చెప్తుంది. అదే మారుమనస్సు అంటారు. ఇక తప్పు చేయని వారు ఎవరు లేకపోయినా తెలిసి తప్పులు చేయడం చాలా పెద్ద తప్పు. వాటిని చాలామంది క్షమించరు కూడా. పాత తప్పులు చేయడం మానేసి కొత్త తప్పులు చేయవచ్చా అని అడిగే వారు కొందరు. ఒక్కొక్కరిది ఒక్కో బుద్ధి.
ఇక విషయానికి వస్తే తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మంచు మోహన్ బాబు అలియాస్ భక్తవత్సల నాయుడు ఒక స్కూల్ డ్రిల్ టీచర్ గా ఉంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా విలన్ గా ఒక వెలుగు వెలిగాడు. అంతే కాదు సుమా..! తనదైన డైలాగ్ డెలివరీతో డైలాగ్ కింగ్‌గా మారి హీరోగా కూడా అద్భుత విజయాలు అందుకున్నాడు.
ఇక నిర్మాతగా మారి లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఆయన ఎన్నో ఆణిముత్యాలు తీశాడు. అల్లుడుగారు, రౌడీ గారి పెళ్ళాం, పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. ఆయన ఈ తరంలోనే కాదు నిన్నటి తరంలో కూడా మెప్పించాడు. నటుడిగా 500లకు పైగా చిత్రాలతో ఆకట్టుకున్నాడు. స్వర్గీయ ఎన్టీఆర్, దాసరి శిష్యునిగా రాజకీయాలు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థతో విద్యాదాతగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఒకటే బాధ.
తనకు దాపరికం తెలియదని.. ఉన్నది ఉన్నట్లు అడిగేస్తానని, కడిగేస్తానని అంటూ ఉంటాడు. అలా ఆయన తనను తాను మభ్యపెట్టుకుంటూ ఉంటాడు. ఆయన తప్పులు చేసినప్పుడు ఎదుటివారు ఎత్తిచూపితే మాత్రం తిడతాడు. కొట్టడానికి వస్తాడు. పక్కవారి తప్పులు తాను చెప్పచ్చు అంటాడు కానీ తన తప్పులు ఎవరూ వేలెత్తి చూపకూడదని నైజం అయనది. ఆయనకు తగ్గట్టుగానే తన పిల్లలను కూడా పెంచాడు. వాళ్లు కూడా అదే టైప్. మంచు విష్ణు, మంచు మనోజ్, చివరికి కూతురైన మంచు లక్ష్మీది కూడా అదే దారి.. రహదారి.
ఇక మంచు లక్ష్మీ విషయానికి వస్తే ఆమె పూర్తి పేరు మంచు లక్ష్మీ ప్రసన్న. ఈమె కుటుంబంలో తల్లి తప్ప అందరూ నటులే. కానీ దురదృష్టవశాత్తు నిజ జీవితంలో కూడా నటులుగానే కనిపిస్తూ నటిస్తూ ఉంటారు. తండ్రి కలెక్షన్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన మోహన్ బాబు అయితే సోదరులు మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్ కుమార్‌లు. ఇక ఈమె వివాహం ప్రవాస భారతీయుడైన ఆండ్రూ శ్రీనివాస్‌తో జరిగింది. ఈయన అమెరికా వాసి.
ఇక సినీ రంగానికి వస్తే తన తండ్రి 500 చిత్రాల్లో నటించి, అంత పేరు పొందినా ఆయన కొడుకులు, కుమార్తె అయిన ఈమె మాత్రం ఆయన వారసత్వాన్ని నిలబెట్టలేకపోతున్నారు. కెరీర్ ప్రారంభంలో ఏదో రెండు మూడు హిట్స్ వచ్చాయి. అంతే అప్పటినుంచి సినిమా చేస్తే ఫట్టే. ఇటీవలే మంచు విష్ణు ‘జిన్నా’ అంటూ జనాల ముందుకు వచ్చాడు.. భయపెట్టాడు. ఇది మంచు విష్ణు కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్.
ఇక మంచు మనోజ్ ఇండస్ట్రీ వదిలేస్తానంటాడు. కొంతకాలం దూరంగా ఉంటాడు. ఉన్నట్టుండి తెరపైకి కనిపిస్తాడు. ముఖ్యంగా వీరికి అంటే వీరి ఫ్యామిలీకి మెగా కాంపౌండ్‌తో పాటు చాలామంది అంటే పడదు అని నానుడి. అలాగని మనసులో ఉంచుకోరు. వీలున్న చోటల్లా చూపిస్తారు. రామోజీరావు నుంచి మోడీ వరకు, చంద్రబాబు నుంచి జగన్ దాకా ఎవరితో ఎప్పుడు విబేధిస్తారో వీరికే తెలియదు. దాంతో వీరికి అభిమానుల కంటే వ్యతిరేకులే ఎక్కువ.
ఇక మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ గానే రాణించాలని ప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత సరే అనుకుని క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నటిగా అయినా సక్సెస్ అవుదాం అనుకుంది. అది వీలు కాలేదు. దాంతో నిర్మాతగా మారి టీవీ షోలు, సినిమాలు నిర్మించింది. పలు కార్యక్రమాలకు హోస్ట్ చేసింది. కానీ ఆమె తెలుగు భాష మాట్లాడుతుంటే జనాలు పరిగెత్తిపోతారు. ఈమె తాజాగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
నా జీవితంలో కొన్ని తప్పులు చేశాను. అవి ఇప్పుడు మార్చలేను. కానీ ఇప్పుడు నేను మారిపోయాను. కాబట్టి మళ్ళీ ఆ తప్పులు చేయను.. అంటూ రాసుకొచ్చింది. అయితే ఏ విషయంలో మంచు లక్ష్మి తప్పు చేసింది అనే విషయంలో మాత్రం తాను క్లారిటీ ఇవ్వలేదు. వృత్తి పరంగానా, వ్యక్తిగతం గానా అనేది తెలియాల్సి ఉంది.
అయినా వృత్తిపరంగా వ్యక్తిగతంగా రెండింట్లోనూ ఆమె బోల్డ్ తప్పులే చేసిందని ఆమె చెప్పుకుంటుండటం విశేషం. వ్యక్తిగత విషయాలు పక్కన పెడితే.. వృత్తిగత జీవితంలోని తప్పుల గురించి అందరికీ స్పష్టంగా తెలుసు. దాంతో ఆ తప్పులు ఏమిటి? అనే దానిపై నెటిజన్లలో, ఇండస్ట్రీలో, సినీ ప్రేక్షకుల్లో పెద్ద చర్చ నడుస్తుంది. దాంతో ఈమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.