నల్గొండ నుంచే పోటీ చేస్తా: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో తను నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తానని అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ కమిటీలో నా పేరు లేకుంటే హై పవర్ కమిటీలో ఉండొచ్చని, మంత్రి పదవిని వదిలేసిన నాకు ఏ పదవులు ముఖ్యం కాదన్నారు. సీఎం కేసీఆర్ నాలుగేళ్ల కింద దత్తత తీసుకున్న నల్గొండ నియోజకవర్గంలో […]

  • Publish Date - December 11, 2022 / 02:04 PM IST

విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో తను నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తానని అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ కమిటీలో నా పేరు లేకుంటే హై పవర్ కమిటీలో ఉండొచ్చని, మంత్రి పదవిని వదిలేసిన నాకు ఏ పదవులు ముఖ్యం కాదన్నారు.

సీఎం కేసీఆర్ నాలుగేళ్ల కింద దత్తత తీసుకున్న నల్గొండ నియోజకవర్గంలో ఏడాదిలోగా పట్టణంలో 5 వేలు, గ్రామాల్లో 300ఇళ్ల చొప్పున డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించాలని కానీ అవేవి జరగ లేదన్నారు. దత్తత అనే మాటకు అర్ధం తేవాలంటే పేదలకు ఇళ్లు ఇవ్వాలన్నారు. అభివృద్ధి అంటే రోడ్లు వెడల్పు చేసి బొమ్మలు పెట్టడం కాదని విమర్శించారు. జనవరి నుంచి రెగ్యులర్‌గా నల్గొండలో పర్యటిస్తానన్నారు.

నల్గొండలో వెంకటేశ్వర కాలనీలో తాను కాపాడిన 100కోట్ల స్థలం ఆస్తిలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కట్టారన్నారు. గుడి ఉన్న చోట పార్టీ ఆఫీస్ కట్టారని, ఎమ్మెల్యే అయ్యాక పార్టీ ఆఫీస్ మార్పిస్తానన్నారు. నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో పలు ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించానని, 378 కోట్లతో రీటెండర్ వేయించి నాగార్జున సాగర్ హైవే పూర్తి చేయించానన్నారు.

రాజకీయాల గురించి ఎన్నికలకు నెల ముందు చెబుతానని తిరుమలలోనే చెప్పానని, ప్రస్తుతానికి అభివృద్ధి, సేవా కార్యక్రమాలే ముఖ్యమన్నారు. దళిత బంధు అర్హులైన వారికి డ్రా తీసి ఇవ్వకుంటే ఆందోళన చేస్తానన్నారు. టీఆర్‌ఎస్ నాయకులకు దళిత బంధు ఇస్తే కోర్టు ఆశ్రయిస్తామన్నారు.

పేద విద్యార్థులకు సాయం చేస్తూ వారి ఉన్నతికి తోడ్పాటు అందిస్తున్నాను అన్నారు. తాజాగా నల్లగొండ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు మెడికల్ విద్యార్థులకు ఒక్కక్కోరికి 75వేల ఆర్థిక సాయం చేశానని భాషాపక కళ్యాణి, కొరివి మహేష్, చెరుపల్లి నిహారిక ఎంబీబీఎస్ సీట్లు సాధించగా.. వీరి చదువు పూర్తయ్యే వరకు ఖర్చంతా భరిస్తానని హామీ ఇచ్చానని తెలిపారు. ఈ ఏడాది 28మంది విద్యార్థులకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించామని ఎంపీ వెంకట్ రెడ్డి చెప్పారు.

నల్లగొండ నియోజకవర్గం నుంచి ఇప్పటికీ ఏ కష్టం వచ్చినా నాకే బాధితులు, స్థానికులు ఫోన్ చేస్తున్నారని వారిని అన్ని రకాలుగా ఆదుకుంటూ అండగా ఉంటానన్నరు. రైతులు సాగునీటి కష్టాలు కూడా నా దృష్టికి తీసుకువస్తున్నారని వాటినీ పరిష్కరిచానని అన్నారు.

ఇకపై నల్లగొండ నియోజకవర్గానికి రెగ్యూలర్‌గా వస్తూ అందుబాటులో ఉంటానని తెలిపారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ భవనాలు నా హయాంలోనే నిర్మాణాలు జరిగాయన్నారు. నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన నల్లగొండ నియోజకవర్గ ప్రజలను మరవనని వారికి అందుబాటులో ఉంటానన్నారు. రెండు రాష్ట్రాలు కలపడం సాధ్యం కాదని, సజ్జల వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు.