Site icon vidhaatha

నా మొగుడికి మినిమం ఇవి ఉండాలి.. యువతి పెళ్లి యాడ్ వైరల్

Matrimonial Ad | పెళ్లి అనగానే ప్రతి అమ్మాయి.. తనకు కాబోయే వాడు ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని కలలు కంటారు. మంచి ఫిట్ నెస్ తో పాటు చదువుకొని, ఆర్థికంగా ఉన్న యువకుడు కావాలని కోరుకుంటారు. ఇలా కలలు కనడంలో తప్పేం లేదు. కానీ ఓ యువతి మాత్రం తనకు కాబోయే మొగుడి గురించి ఇచ్చిన పెళ్లి యాడ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె కోరికలు చూస్తే తప్పకుండా.. ఆ యువతికి వరుడు దొరకడం కష్టమే అని తప్పక చెబుతారు. మరి అలా ఉన్నాయి ఆమె కోరికలు.

ఆ యువతి కోరికలు ఏంటో చూద్దామా.. తనకు కావాల్సిన వరుడు ఏ సంవత్సరంలో పుట్టాలి. ఏయే డిగ్రీలు కలిగి ఉండాలి. ఒక వేళ ఆ డిగ్రీలు కలిగి ఉంటే ఏయే కాలేజీల్లో చదివి ఉండాలో ఆమె సూచించింది. ఇక ఎత్తు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది.కేవలం ఇద్దరు తోబుట్టువులు మాత్రమే ఉండాలని యాడ్‌లో స్పష్టంగా నివేదించింది.

ఆ యువతి పెళ్లి యాడ్ ఇలా ఉంది..

1992, జూన్‌ కంటే ముందు జన్మించి ఉండరాదు. అబ్బాయి ఎంబీఏ, ఎంటెక్, ఎంఎస్ లేదా పీజీడీఎం చేసి ఉండాలి. ఈ డిగ్రీలు కచ్చితంగా టైర్ వన్ విద్యాసంస్థల నుంచి మాత్రమే పొంది ఉండాలి. ఒక వేళ ఇంజినీరింగ్ చేసి ఉంటే.. కచ్చితంగా ఐఐటీ బాంబే, ఖరగ్‌పూర్‌, మద్రాస్, కాన్పూర్‌, ఢిల్లీ, రూర్కీ, గువహటి నుంచి చదివి ఉండాలి.

లేదా ఎన్‌ఐటీ కాలికట్‌, ఢిల్లీ, కురుక్షేత్ర, జలంధర్ ట్రిచ్చి, సురత్కల్‌, వరంగల్‌ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ పొంది ఉండాలి. లేదా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, అలహాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు, ఐఐఎస్‌సీ బెంగళూరు, బిట్స్ పిలానీ, హైదరాబాద్‌, డీటీయూ, ఎన్‌ఎస్‌ఐటీ, జాదవ్‌పూర్‌ యూనివర్సిటీల నుంచైనా ఇంజినీరింగ్ చదివి ఉండాలి.

ఎంబీఏ చేసి ఉంటే.. ఐఐఎం అహ్మదాబాద్‌, బెంగళూరు, కలకత్తా, ఇండోర్‌, లక్నో, కోజికోడ్‌, ఎఫ్‌ఎంఎస్‌, ఐఐఎఫ్‌టీ, ఐఎస్‌బీ, జేబీఐఎంఎస్‌, ఎండీఐ, ఎన్‌ఐటీఐఈ, ఎస్‌పీ జైన్‌, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ నుంచి ఎంబీఏ పట్టా పొంది ఉండాలి. మరి జీతం విషయానికి వస్తే సంవత్సరానికి రూ. 30 లక్షల జీతం కచ్చితంగా సంపాదించాలి.

ఇక అబ్బాయి ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతానికి చెందిన వాడై ఉండాలని చెప్పింది. ఎత్తు 5.7 అడుగుల నుంచి 6 అడుగుల మధ్య ఉండాలని తన మనసులో ఉన్న విషయాలన్నీ ఆ యాడ్‌లో స్పష్టంగా పేర్కొంది ఆ యువతి. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version