Marriage Dreams | కలలు( Dreams ) కనడం సహజం.. కలలు చాలా వరకు నిద్రిస్తున్న సమయంలో పడుతుంటాయి. వివిధ రూపాల్లో కలలు వస్తుంటాయి. ఆ కలలు కొన్ని శుభాలను కలిగింపజేస్తాయి.. మరికొన్ని అశుభాలను కలిగిస్తాయి. అయితే ముఖ్యంగా పెళ్లిళ్లకు( Marriage ) సంబంధించిన కలలు వస్తే వాటిని చెడుగా భావించొద్దు. అమ్మాయిలకు పెళ్లి కలలు( Marriage Dreams ) పడితే.. వారు వీలైనంత త్వరగా పెళ్లి పీటలెక్కబోతున్నారని అర్థం చేసుకోవాలి. ఈ ఐదు కలలు అమ్మాయిలకు( Girls ) పడితే వారికి త్వరలోనే వివాహం అయ్యే అవకాశం అధికంగా ఉంటుందని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఐదు కలలు ఏంటో తెలుసుకుందాం..
పువ్వులు కలలో వస్తే..
అమ్మాయిలు నిద్రిస్తున్న వేళ.. వారికి పువ్వులు( Flowers ) కలలో వస్తే.. శుభప్రదంగా భావించాలి. మరి ముఖ్యంగా గులాబీ( Rose ) పువ్వులు కలలో కనిపించినట్లయితే.. వారి జీవితంలో ప్రేమ( Love ), వివాహం( Marriage ) ప్రారంభం కాబోతుందని అర్థం చేసుకోవాలి. పెళ్లి కాని యువతులకు ఇలాంటి కల వస్తే.. త్వరలోనే పెళ్లి పీటలెక్కుతారని అర్థం.
సింధూరం కనిపిస్తే..
పాపిటలో సింధూరం( Sindoor ) పెట్టుకున్న వివాహిత( Married Woman ) కలలో కనిపిస్తే.. శుభప్రదంగా పరిగణించాలి. ఇలాంటి కలలు శుభసూచకంగా భావించాలి.. ఈ కల అదృష్టాన్ని కలిగిస్తుందని, వివాహం చేసుకునే సమయం ఆసన్నమైందని భావించాలి. కోరుకున్న వ్యక్తిని పెళ్లాడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
నూతన వధూవరులు కలలోకి వస్తే..
నూతన వధూవరులు( Newly Wed Couple ) కలలోకి వస్తే ఎగిరి గంతేయాలి. ఎందుకంటే.. ఈ కల వచ్చిన వారు కూడా త్వరలో వివాహం చేసుకుంటారని అర్థం. మంచి అందగాడు జీవితంలోకి ప్రవేశిస్తాడని నమ్మకం. ఇక వివాహం కోసం ఇంట్లో చర్చలు ప్రారంభమవుతాయని భావించాలి.
గాజులు, మెట్టెలు, తాళి కనిపిస్తే..
వివాహిత స్త్రీకి సంబంధించిన గాజులు( Bangles ), మెట్టెలు, తాళిబొట్టు కలలో కనిపిస్తే కూడా శుభప్రదంగా పరిగణించాలి. వీటిని చూసినట్లు అయితే.. పెళ్లికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు భావించాలి. కొత్త వ్యక్తి వీలైనంత త్వరగా మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నట్లు భావించాలి.
వివాహం జరిగినట్టు కల వస్తే..
ఆలయం( Temple )లో లేదా వివాహ మండపంలో పెళ్లి జరుగుతున్నట్టు కల వస్తే కూడా శుభంగా భావించాలి. మీ పెళ్లి ఏర్పాట్లకు ఈ కలను శుభ సంకేతంగా భావించాలి. ఆ దేవుడి దయతో మీరు కూడా సంసార జీవితంలోకి ప్రవేశించబోతారన్న మాట. సరైన వరుడు మీకు లభిస్తాడని భావించాలి.