Site icon vidhaatha

చీర‌క‌ట్టులో క‌బ‌డ్డీ ఆడి దుమ్ములేపిన మ‌హిళ‌లు.. వీడియో వైర‌ల్

విధాత: అది ఓ ప‌ల్లెటూరు.. మ‌హిళ‌లంతా ఒకే చోట గుమిగూడారు. క‌బ‌డ్డీ పోటీల్లో పాల్గొన్నారు. చీర‌క‌ట్టులో క‌బ‌డ్డీ ఆడిన ఆ మ‌హిళ‌లు గ్రౌండ్‌లో దుమ్ములేపారు. నైపుణ్యం గ‌ల ఆట‌గాళ్లు ఆడిన మాదిరిగానే క‌బ‌డ్డీ ఆడి.. అంద‌రి హృద‌యాల‌ను గెలుచుకున్నారు. ప్ర‌స్తుతం మ‌హిళ‌ల క‌బ‌డ్డీకి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతున్న‌ది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు చెందిన ఓ గ్రామంలో క‌బ‌డ్డీ పోటీలు జ‌రిగాయి. ఈ పోటీల్లో గ్రామంలోని మ‌హిళ‌లు పాల్గొన్నారు. వారంతా చీర‌లు క‌ట్టారు. నెత్తికి కొంగు చుట్టుకున్నారు. ఇక గ్రౌండ్‌లో దిగి క‌బ‌డ్డీ.. క‌బ‌డ్డీ అంటూ కేక పెట్టి.. ఆడుతుంటే అంద‌రూ ఫిదా అయిపోయారు.

ఆట ప‌ట్ల ఎంతో నైపుణ్యం ఆట‌గాళ్ల మాదిరిగా దుమ్ములేపారు. ఈ ఆట‌కు సంబంధించిన వీడియోను ఐఏఎస్ ఆఫీస‌ర్ అవ‌నీష్ శ‌ర‌ణ్ త‌న ట్విట్ట‌ర్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోను 2,85,000 మంది వీక్షించ‌గా, 12 వేల మంది లైక్ చేశారు.

Exit mobile version