ప్ర‌పంచంలోనే రెండ‌వ అత్యంత వృద్ధ మ‌హిళ మృతి

ఈ వృద్ధురాలు ప్ర‌పంచంలోనే రెండ‌వ అత్యంత వృద్ధురాలు. 116 ఏండ్ల వ‌య‌సులో ఆమె క‌న్నుమూసింది.

  • Publish Date - December 13, 2023 / 04:08 AM IST

విధాత‌: ఈ వృద్ధురాలు ప్ర‌పంచంలోనే రెండ‌వ అత్యంత వృద్ధురాలు. 116 ఏండ్ల వ‌య‌సులో ఆమె క‌న్నుమూసింది. న‌ర్సింగ్ హోంలో ఉంటున్న ఆ వృద్ధురాలు త‌న‌కు ఇష్ట‌మైన ఆహారం బీన్ పేస్ట్ జెల్లీ తిన్న త‌ర్వాత తుదిశ్వాస విడిచింది.


వివ‌రాల్లోకి వెళ్తే.. జ‌పాన్‌కు చెందిన ప్యూసా త‌త్సుమీ(116) ప్ర‌పంచంలోనే రెండో వృద్ధ మ‌హిళ‌. జ‌పాన్‌లో వృద్ధ మ‌హిళ కూడా. వ‌ర‌ల్డ్ ఓల్డెస్ట్ ప‌ర్స‌న్ కానే త‌నాక 119 ఏండ్ల వ‌య‌సులో మ‌ర‌ణించింది. త‌నాక‌ను ప్ర‌పంచ వృద్ధ మ‌హిళగా గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్.. 2022, ఏప్రిల్ నెల‌లో అధికారికంగా గుర్తించింది. ఆ త‌ర్వాత ప్యూసా రెండో వృద్ధ మ‌హిళ‌గా పేరుగాంచింది.


ప్యూసా 1907లో జ‌న్మించారు. ఈమెకు ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. భ‌ర్త రైతు. వ‌య‌సురీత్యా చివ‌రి రోజుల్లో ఆమె మంచానికే ప‌రిమిత‌మైంది. ప్యూసాకు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేవు. ఆమెకు 70 ఏండ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు తొడ ఎముక విరిగింది. ఆ ఒక్క ప్ర‌మాదం త‌ప్పితే ఆమెను ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు ద‌రి చేర‌లేదు. ప్యూసాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. 106 ఏండ్ల వ‌య‌సులో ఆమె వృద్ధాశ్ర‌మంలో చేరింది. అప్ప‌టి వ‌ర‌కు ఆమె తోట ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యేది.