YCP అధికారిక ట్విటర్ ఖాతా హ్యాక్..

అమరావతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ (వైకాపా) అధికారిక ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. శుక్రవారం అర్ధరాత్రి కొందరు హ్యాకర్లు వైకాపా ట్విటర్‌ ఖాతాను హ్యాక్ చేశారు.YSR CONGRESS PARTY' పేరిట ఏర్పాటు చేసిన ఈ ట్విటర్‌ అకౌంట్‌లో ప్రభుత్వ కార్యక్రమాలు, సీఎం ప్రసంగాలు, పార్టీకి సంబంధించిన కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతుంటారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి చిత్ర విచిత్రమైన పోస్టులను కొందరు పోస్టు చేస్తున్నారు. ట్విటర్‌ ఖాతా ప్రొఫైల్ ఫొటో, ఖాతా వివరాలను మార్చేశారు. […]

  • Publish Date - December 10, 2022 / 01:46 PM IST

అమరావతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ (వైకాపా) అధికారిక ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. శుక్రవారం అర్ధరాత్రి కొందరు హ్యాకర్లు వైకాపా ట్విటర్‌ ఖాతాను హ్యాక్ చేశారు.YSR CONGRESS PARTY’ పేరిట ఏర్పాటు చేసిన ఈ ట్విటర్‌ అకౌంట్‌లో ప్రభుత్వ కార్యక్రమాలు, సీఎం ప్రసంగాలు, పార్టీకి సంబంధించిన కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతుంటారు.

శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి చిత్ర విచిత్రమైన పోస్టులను కొందరు పోస్టు చేస్తున్నారు. ట్విటర్‌ ఖాతా ప్రొఫైల్ ఫొటో, ఖాతా వివరాలను మార్చేశారు. పలు రకాల జంతువుల కార్టూన్ల ఫొటోలను హ్యాకర్లు ట్విటర్‌లో పోస్టు చేశారు. కొన్ని గంటలుగా ఈ తరహా పోస్టులు కొనసాగుతున్నాయి. పార్టీ ట్విటర్‌ ఖాతా హ్యాకింగ్‌ను గుర్తించిన వైకాపా డిజిటల్ మీడియా విభాగం.. పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.