North Eastern States | నాటి కాంగ్రెస్‌ నేతలే నేడు కమలనాథులు.. అసంతృప్తులను చేరదీసి ఈశాన్యంలో బలోపేతమైన BJP

North Eastern States, BJP, CONGRESS వామక్షాలతో పొత్తుతో లాభం కంటే నష్టమే ఎక్కువ నాడు తిరుగులేని ఆధిపత్యం.. నేడు నిరాశ కలిగించే ఫలితాలు విధాత‌: ఈశాన్య రాష్ట్రాలు (North Eastern States) ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీ (Congress Party)కి కంచుకోటలు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలపై చర్చ జరిగినా.. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు అంటే అంతగా ఆసక్తి ఉండేది కాదు. ఇదంతా పదేళ్ల కిందట ముచ్చట. కానీ క్రైస్తవ (Christian), ఆదివాసీ(Adivasi) జనాభా ఎక్కువగా ఉన్న […]

  • Publish Date - March 4, 2023 / 03:35 AM IST

North Eastern States, BJP, CONGRESS

  • వామక్షాలతో పొత్తుతో లాభం కంటే నష్టమే ఎక్కువ
  • నాడు తిరుగులేని ఆధిపత్యం.. నేడు నిరాశ కలిగించే ఫలితాలు

విధాత‌: ఈశాన్య రాష్ట్రాలు (North Eastern States) ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీ (Congress Party)కి కంచుకోటలు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలపై చర్చ జరిగినా.. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు అంటే అంతగా ఆసక్తి ఉండేది కాదు. ఇదంతా పదేళ్ల కిందట ముచ్చట. కానీ క్రైస్తవ (Christian), ఆదివాసీ(Adivasi) జనాభా ఎక్కువగా ఉన్న ఆ ప్రాంతాల్లో కమలం వికాసం అంతంత మాత్రమే.

కానీ ఈ తొమ్మిదేళ్ల కాలంలో అక్కడ పరిస్థితి మారింది. అక్కడ సింగిల్‌ డిజిట్‌ నుంచి ఇప్పుడు ఏకంగా అధికారంలోకి వచ్చే స్థితికి బీజేపీ (BJP) చేరుకున్నది. నాడు అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వ్యూహాత్మాక, భౌగోళిక ప్రాధాన్యం దృష్ట్యా ఆ ప్రాంతానికి పెద్దపీట వేసింది. ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఏకంగా కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ(Special Ministry)ను ఏర్పాటు చేసింది.

నాడు వాజపేయి వేసిన పునాదిని నేడు మోడీ (Modi) ప్రభుత్వం కొనసాగిస్తూ.. నేడు కమ్యూనిస్టు (Communist) కోటను బద్దలు కొట్టి త్రిపుర (Tripura)లో రెండోసారి అధికారంలోకి రావడానికి కారణమైంది. అక్కడ ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) విస్తృతంగా కార్యకలాపాలు చేపట్టడం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యత కొనసాగించే చిన్న పార్టీల వైఖరి ఇవాళ అక్కడ బీజేపీకి కలిసి వచ్చింది. కానీ ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాల (North Eastern States) రాజకీయాల్లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్‌ ప్రభావం నామమాత్రంగా ఉన్నది.

  • నాడు కంచుకోట.. నేడు నామమాత్రమే

రాహుల్‌గాంధీ భారత్‌ జోడోయాత్ర (Rahul Gandhi Bharat Jodoyatra)తో కాంగ్రెస్‌ కార్యకర్తల్లో జోష్‌ వచ్చినా అవి ఎన్నికల సమయంలో ఓట్ల రూపంలోకి మారలేదని తాజాగా వెల్లడైన మూడు రాష్ట్రాల ఫలితాలను బట్టి అర్థమౌతున్నది. ప్లీనరీ(Plenary) నిర్వహించిన కొద్దిరోజులకే వెలుడిన ఈ ఫలితాలు ఆ పార్టీకి నిరాశ కలిగించేవే. అలాగే వామక్షాలతో పొత్తును కూడా ప్రజలు తిరస్కరిస్తున్నారని ఈ ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొదట పశ్చిమబెంగాల్‌(West Bengal)లో తాజాగా త్రిపురలో ఈ ప్రయోగం విఫలమైందని గుర్తు చేస్తున్నారు. త్రిపురలో వామపక్షాలతో కలిసి 13చోట్ల పోటీ చేస్తే 3 చోట్ల మాత్రమే గెలుపొందగా.. మేఘాలయ (Meghalaya)లో 60 సీట్లలో పోటీ చేస్తే 5 చోట్లనే విజయం సాధించగా.. నాగాలాండ్‌ (Nagaland)లో 23 చోట్ల బరిలోకి దిగినప్పటికీ ఒక్క సీటు కూడా దక్కించుకోకపోవడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నది.

  • కాంగ్రెస్‌ అసంతృప్త నేతలే నేటి కమలవీరులు

ఈశాన్య రాష్ట్రాల్లో (North Eastern States) తిరుగులేని పార్టీగా వెలుగొందిన కాంగ్రెస్‌ పార్టీలోని కీలక నేతలే నేడు బీజేపీకి బలంగా మారారు. హస్తం పార్టీ అధిష్ఠాన వైఖరితో విసిగిపోయిన నేతలకు బీజేపీ ఆశ్రయం ఇచ్చింది.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Assam Chief Minister Himanta Biswasharma) కాంగ్రెస్‌లో ఒకప్పుడు కీలక నేత. రాహుల్‌ వైఖరి నచ్చక ఆయన ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మూడు రాష్ట్రాల్లో రెండు చోట్ల బీజేపీ కూటమి గెలువడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

అలాగే అరుణాచల్‌ ప్రదేశ్‌(Arunachal Pradesh) మాజీ సీఎం పెమా ఖండూ(Former CM Pema Khandu), మణిపూర్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌(CM Biren Singh) నుంచి బైటికి వచ్చి బీజేపీలో చేరిన వారే. కాంగ్రెస్‌ బలగం అసంతృప్తే కమలం పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుని బలంగా మారి విస్తరించింది.

ముఖ్యంగా మోడీ-షా(Modi-Shah)లు దేశమంతా బీజేపీ విస్తరణ కోసం ఆపార్టీ సిద్ధాంతాలన్నీ పక్కనపెట్టి విపక్ష నేతలకే పెద్దపీట వేస్తున్నారు. దాని ఫలితమే చాలా రాష్ట్రాల్లో ఉనికే లేని పార్టీ తిరుగులేని విజయాలు సాధించే స్థాయికి చేరుకున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Latest News