Site icon vidhaatha

Young Woman Car On Railway Track| రైల్వే ట్రాక్ పై కారుతో యువతి

విధాత, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కొండకల్లో గురువారం ఉదయం రైల్వే గేట్ క్రాసింగ్ మీదుగా ఓ యువతి కారుతో పట్టాల మీదుగా దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. లక్నోకు చెందిన రభిక సోనీ తన కియాకారులో కొండకల్ నాగులపల్లి నుంచి శంకర్ పల్లి వరకు రైల్వే ట్రాక్ పైనే వెళ్లింది. రైల్వే సిబ్బంది గమనించి కారును అడ్డుకున్నారు. కారు నడుపుతున్న యువతిని అదుపులోకి తీసుకున్నారు. అప్రమత్తమైన అధికారులు  ఆ మార్గంలో రైళ్లు రాకపోకలు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో హైదరాబాద్ బెంగుళూరు మార్గంలో రైళ్ల రాకపోకలకు కొంత సేపు అంతరాయం కల్గింది.

నార్సింగిలో నివాసం ఉంటున్న సోనీ సాఫ్ట్​వేర్​ ఉద్యోగం చేస్తుంది. నార్సింగి నుంచి కొండగల్​ వద్ద కారుతో పట్టాలపైకి యువతి వెళ్లింది. వికారాబాద్​ వైపు సుమారు 7 కి.మీ. పట్టాలపై యువతి కారును నడిపింది. పోలీసుల అదుపులో ఉన్న రభిక సోనీ విచారణకు సహకరించకుండా మొండికేశారు. ఆమె మద్యం మత్తులో ఉన్నట్లుగా భావిస్తున్నారు. రీల్స్ కోసమే రభిక సోనీ రైల్వే ట్రాక్ పై కారు నడిపినట్లుగా అనుమానిస్తున్నారు.

 

Exit mobile version