విధాత : శ్రీరాముడిపై భక్తిని భక్తులు పలు విధాలుగా చాటుకుంటున్నారు. తాజాగా లక్నో ఫన్ రిపబ్లిక్ మాల్ లో 18 అడుగుల ఎత్తైన రాముడి విగ్రహం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 25 మంది కళాకారులు 20 రోజులు కష్టపడి తీర్చిదిద్దిన ఈ రాముడి విగ్రహం ఏషియా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
మాల్ కు వచ్చిన కస్టమర్లు విల్లంబుల ధరించిన కోదండ రాముడి విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతూ భక్తితో మొక్కుతున్నారు. రాముడి విగ్రహాన్ని తమ సెల్ ఫోన్ కెమెరాల్లో బంధించి మురిసిపోతున్నారు.