Site icon vidhaatha

వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి


విధాత: వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలా రెడ్డి ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఈ 2024 సంవత్సరంలో తన కుమారుడి వివాహం జరగనున్నట్లు న్యూ ఇయర్ విషెస్ తో పాటు తీపి కబురు అందించారు. కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఓ ఇంటివాడు కాబోతున్నట్లు చెప్పారు. అట్లూరి ప్రియతో ఈనెల 18న నిశ్చితార్థం జరగనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 17న వివాహ వేడుక జరగనున్న సంగతిని మీతో పంచుకోవడం ఆనందంగా ఉందని షర్మిల అన్నారు.

Exit mobile version