విధాత, మెదక్ బ్యూరో: జిల్లా పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశం ఈ నెల 17న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలతా శేఖర్ గౌడ్ అధ్యక్షతన జరుగుతుందని శనివారం జడ్పీ సీఈవో వెంకట శైలేష్ తెలిపారు.
కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో 17న శనివారం ఉదయం 11 గంటలకు జరిగే సర్వ సభ్య సమావేశానికి రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖామాత్యులతో పాటు పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, డిసిఎంఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థ, డిసిసిబి అధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు. కావున అధికారులు సమగ్ర సమాచారంతో సమావేశానికి సకాలంలో హాజరు కావలసినదిగా శైలేష్ కోరారు.