Life style | ఏసీ వేసుకోగానే ఈ టిప్స్‌ పాటించండి.. కరెంట్ బిల్లు గురించి టెన్షనే అక్కర్లేదు..!

Life style : వేసవి వచ్చిందంటే భరించలేని ఉక్కపోత ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలైతే ఉబ్బరానికి తట్టుకోలేక విలవిల్లాడుతుంటారు. ఆ వేడికి ఫ్యాన్ గాలి కూడా వేడిగానే వస్తుంది. కూలర్‌లు పెట్టుకుంటే కొంత చల్లగా ఉనప్పటికీ ఒళ్లంతా జిడ్డుజిడ్డుగా మారుతుంది. కాబట్టి ఇక మిగిలిన ఆప్షన్‌ ఏసీ మాత్రమే. అయితే ఈ ఏసీల వాడకం ఖరీదుతో కూడిన పని.

  • Publish Date - May 12, 2024 / 09:48 AM IST

Life style : వేసవి వచ్చిందంటే భరించలేని ఉక్కపోత ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలైతే ఉబ్బరానికి తట్టుకోలేక విలవిల్లాడుతుంటారు. ఆ వేడికి ఫ్యాన్ గాలి కూడా వేడిగానే వస్తుంది. కూలర్‌లు పెట్టుకుంటే కొంత చల్లగా ఉనప్పటికీ ఒళ్లంతా జిడ్డుజిడ్డుగా మారుతుంది. కాబట్టి ఇక మిగిలిన ఆప్షన్‌ ఏసీ మాత్రమే. అయితే ఈ ఏసీల వాడకం ఖరీదుతో కూడిన పని. కరెంటు బిల్లు వేలల్లో వస్తుంది. మరె ఏసీని వినియోగించినా కరెంటు ఎక్కువగా రాకూడదంటే కొన్ని చిన్న చిన్న టిప్స్‌ పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పవర్‌ సేవింగ్‌ టిప్స్‌

తరచూ టెంపరేచర్‌ మార్చొద్దు

ఏసీ వేసుకన్న తర్వాత కొందరు ఉష్ణోగ్రతను తరచూ పెంచడం లేదా తగ్గించడం చేస్తుంటారు. ఇది మంచి అలవాటు కాదు. ఇలా చేయడంవల్ల AC పని తీరు దెబ్బతింటుంది. మీరు ఒకే ఉష్ణోగ్రత వద్ద AC ని వినియోగిస్తే దానిపై పనిభారం తగ్గుతుంది. ఫలితంగా విద్యుత్ లోడ్ కూడా పెరగకుండా ఉంటుంది.

లో టెంపరేచర్‌ వద్దు

సాధారణంగా ఏసీలో ఉష్ణోగ్రతను ఒక్కొక్క డిగ్రీ తగ్గించినా కొద్ది ఆరు శాతం చొప్పున విద్యుత్‌ వినియోగం పెరుగుతూ వస్తుంది. దాంతో ఆ మేరకు కరెంటు బిల్లు కూడా అదనంగా వస్తుంది. కొంతమంది గది త్వరగా చల్లబడటం కోసం ఏసీ టెంపరేచర్‌ను 18, 19 డిగ్రీల స్థాయికి తగ్గిస్తారు. కానీ అందుకు తగ్గట్టుగానే కరెంటు బిల్లు భారీగా వస్తుంది. కాబట్టి ఏసీని ఎప్పుడూ 23-25 డిగ్రీ సెల్సియస్ మధ్య ఉపయోగించడం ఉత్తమం.

ఏసీతోపాటు ఫ్యాన్‌ కూడా వేయండి

ఏసీని ఎక్కువ టెంపరేచర్‌లో వాడటం వల్ల గది త్వరగా చల్లబడటం లేదంటే కాసేపు ఫ్యాన్‌ కూడా వేయండి. దాంతో ఏసీ చల్లదనం చాలా త్వరగా గది అంతటికి వ్యాపిస్తుంది. ఆ తర్వాత ఏసీ ఆఫ్‌ చేసినా చాలా సేపటి వరకు గది చల్లగా ఉంటుంది. దాంతో కరెంటు బిల్లు ఆదా అవుతుంది.

వేడిని ఉత్పత్తి చేసే వస్తువులను పక్కన పెట్టండి

మీరు ఏసీని వినియోగిస్తున్నప్పుడు ఫ్రిజ్, ల్యాప్‌టాప్ లాంటి ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసే ఉత్పత్తులను వినియోగించకండి. అవి గదిలోని వేడిని పెంచుతాయి. దాంతో ఏసీని తక్కువ టెంపరేచర్‌లో వినియోగించాల్సి వస్తుంది. దాంతో కరెంటు బిల్లు అధికంగా వస్తుంది.

Latest News