I Bomma Ravi | పైరసీ ప్రపంచంలో చక్రం తిప్పిన ఐ బొమ్మ రవి కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. టెక్నికల్ స్కిల్స్ ఉన్న రవిని పోలీసులు విచారణలో ప్రశంసించడమే కాకుండా, సైబర్ క్రైమ్ విభాగంలో ఉద్యోగాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. రవి టెక్నికల్ ప్రతిభను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో పోలీసులు అతనికి మంచి జీతంతో పనిచేసే అవకాశం ఇచ్చినట్లు సమాచారం. కానీ రవి మాత్రం ఆ ఆఫర్‌ను తిరస్కరించాడని విచారణ వర్గాలు చెబుతున్నాయి.
‘నీ బొమ్మ క్లోజ్ అయింది… తర్వాత ఏంటి?’ – పోలీసుల ప్రశ్నకు రవి ‘కరేబియన్ ప్లాన్’!
కస్టడీలో రవిని ప్రశ్నిస్తున్న సమయంలో పోలీసుల ప్రశ్నలకు అతని సమాధానాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
పోలీసులు ..“నీ బొమ్మ క్లోజ్ అయింది.. తర్వాత ఏంటి?” అని అడగగా, రవి స్పందిస్తూ.. “కరేబియన్ దీవుల్లో రెస్టారెంట్ పెడతాను. తెలంగాణ, ఆంధ్రా వంటకాలు ప్రపంచానికి పరిచయం చేస్తాను అని చెప్పాడట. రెస్టారెంట్‌కి ఏ పేరు పెడతావన్న ప్రశ్నకు మాత్రం రవి మరింత షాకింగ్ రిప్లై ఇచ్చాడు . “ఐ బొమ్మ… అనే పేరుతో పెడతా!” అని చెప్పడంతో విచారణ అధికారులు ఆశ్చర్యపోయారట.
రవి ప్రకారం, కరేబియన్‌లో మొదటి రెస్టారెంట్ ప్రారంభించిన వెంటనే ప్రపంచ దేశాల్లో కూడా “ఐ బొమ్మ రెస్టారెంట్” బ్రాంచ్‌లను ఏర్పాటు చేయాలన్నది అతని భారీ ప్లాన్. విచారణలో రవి ఓపెన్‌గా చెప్పిన విషయాలు మరింత సంచలనం రేపుతున్నాయి.
తన జీవిత లక్ష్యం ఏంటని పోలీసులు ప్రశ్నించగా .. “లైఫ్ ఎంజాయ్ చేయడమే నా టార్గెట్. ఇదే నా స్టైల్!” అని చెప్పాడట.
ఐ బొమ్మ ద్వారా సంపాదించిన మొత్తం రూ.20 కోట్లు కాగా, వాటిలో రూ.17 కోట్లు పూర్తిగా లైఫ్ ఎంజాయ్ చేయడానికే ఖర్చు చేస్తాడట. కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ & నెవిస్ దేశ పౌరసత్వం కోసం 1 లక్ష డాలర్లు (రూ.80 లక్షలు) చెల్లింపు, వారానికొక దేశం తిరుగుతూ జీవించాలన్న ప్లాన్ అతనికి ఉందట. ఇదంతా విచారణలో రవి పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
ఖాతాల్లో రూ.3 కోట్ల సీజ్… ఆస్తులపై పోలీసుల హ్యాండ్
రవికి చెందిన బ్యాంక్ ఖాతాల్లో మిగిలిన రూ.3 కోట్లు, హైదరాబాద్‌లోని ఫ్లాటు, విశాఖపట్నంలోని ఆస్తులను పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, రవికి త్వరలో బెయిల్ వచ్చే అవకాశమున్నట్లు పలు వర్గాలు చెబుతున్నాయి. ఐ బొమ్మ రవి చేసిన పైరసీ టాలీవుడ్ పరిశ్రమను ఎన్నాళ్లుగానో ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతని విచారణలో బయటపడుతున్న వివరాలు, అతని లైఫ్ స్టైల్, భవిష్యత్ ప్లాన్లు నెట్టింట పెద్ద చర్చగా మారాయి.
