విధాత: టాలీవుడ్ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజకు ఆన్ లైన ట్రేడింగ్ లో బిగ్ షాక్ ఎదురైంది. ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో అమితవ్ తేజ నుంచి ఓ జంట రూ.72లక్షలు కాజేసిన ఘటన వైరల్ గా మారింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు అమితవ్ తేజ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవలే సీబీఐ మాజీ డైరెక్టర్ జే.డీ. లక్ష్మినారాయణ సతీమణి ఊర్మిళ సైబర్ నేరస్తుల వలలో చిక్కి రూ.2.58కోట్లు మోసపోయిన సంగతి వైరల్ అయ్యింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో భారీ లాభాలు ఆర్జించవచ్చన్న సైబర్ నేరస్తుల మాయమాటలను నమ్మి ఏకంగా రూ.2.58 కోట్లు మోసపోయారు. బాధితురాలు ఉర్మిళ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజ కూడా ఆన్ లైన్ మోసానికి గురవ్వడం సంచలన రేపింది.
