విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ‘ఆపరేషన్ ఆక్టోపస్’ ద్వారా దేశ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లపై భారీ ఆపరేషన్ నిర్వహించారు. 16 రాష్ట్రాల్లో దాడులు చేసి దేశ వ్యాప్త సైబర్ నెట్ వర్క్ లోని 104 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుల్లో బ్యాంకు అధికారులు కూడా ఉండటం గమనార్హం.
నిందితులపై 1,055 కేసులు ఉండగా, ఇప్పటివరకు వారంతా రూ.127 కోట్ల మోసాలకు పాల్పడ్డారు. నిందితుల నుంచి రూ.36 లక్షల నగదు, 200లకు పైగా మొబైల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి :
Milk Adulteration : రాజమండ్రి కల్తీ పాలు కేసులో కీలక పరిణామం
Inter Exams | 5 నిమిషాలు ఆలస్యమైనా.. ఇంటర్ పరీక్షలకు అనుమతి
