Milk Adulteration : రాజమండ్రి కల్తీ పాలు కేసులో కీలక పరిణామం

రాజమండ్రి కల్తీ పాలు కేసులో కూలింగ్ ఛాంబర్ నుంచి ఇథిలిన్ గ్లైకాల్ లీక్ వల్లే పాలు కలుషితం అయినట్లు అధికారులు నిర్ధారించారు. ఇప్పటివరకు 5 మంది మృతి చెందారు.

Milk Adulteration : రాజమండ్రి కల్తీ పాలు కేసులో కీలక పరిణామం

విధాత, హైదరాబాద్ : ఐదుగురి మృతికి కారణమైన రాజమండ్రి కల్తీ పాలు ఘటనలో కీలక అంశాలు వెలుగుచూశాయి. పాల కేంద్రంలోని కూలింగ్‌ ఛాంబర్‌లో కూలెంట్‌ లీకేజ్‌ వల్లే పాలు కల్తీ అయ్యినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. కూలింగ్‌ ఛాంబర్‌లో ఇథలిన్‌ గ్లైకాల్‌‌ని వినియోగిస్తారని.. అదొక విషపదార్థం అని, అది లీక్ అయ్యి పాలు కలుషితం అయ్యాయని..వాటిని తాగిన జనాలు అనారోగ్య బారిన పడ్డారని పోలీసులు వెల్లడించారు.

40 లీట‌ర్ల పాల‌లో కెమిక‌ల్ క‌లిసినట్లుగా గుర్తించామని, వాటిని శాంపిల్స్ స్టేట్ ఫుడ్ లాబ‌రేట‌రీకి పంపినట్లుగా అధికారులు తెలిపారు.
ఇప్పటికే ఈ కేసులో పాల వ్యాపారి గణేష్‌ అరెస్టు చేసి, అత‌నిపై ప‌లు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. కల్తీ పాలు తాగిన వారు కిడ్నీ సమస్యలు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యారు. విషపూరితమైన పాలు తాగిన వారిలో ఇప్పటిదాకా 5 గురు మృతి, మరో 12 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. బాధితుల చికిత్స ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

అప్రమత్తమైన ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం

క‌ల్తీ పాలు తాగి రాజ‌మండ్రిలో ఐదుగురు మృతి చెందిన ఘటనతో అప్రమత్తమైన ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం పాల కేంద్రాల వద్ద ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. పాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Couple | 2011 కాలేజ్‌లో వేసిన‌ డ్యాన్స్‌ను పెళ్లిలో రిక్రియేట్ చేసిన జంట‌.. హృదయాన్ని హత్తుకునే వీడియో
వచ్చే ఐదేళ్లలో 1.50 కోట్ల యాప్స్ మాయం..ఆ స్థానంలో ఏఐ ఏజెంట్లు