Couple | 2011 కాలేజ్‌లో వేసిన డ్యాన్స్‌ను పెళ్లిలో రిక్రియేట్ చేసిన జంట.. హృదయాన్ని హత్తుకునే వీడియో
ఓ జంట (Couple) తమ పెళ్లి సందర్భంగా 15 ఏళ్లనాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంది. కాలేజ్ డేస్‌లో చేసిన డ్యాన్స్‌ను మళ్లీ ఇప్పుడు తమ పెళ్లిలో రిక్రియేట్ (college dance at wedding ) చేసి అందరినీ ఆకట్టుకుంది.
Couple | ప్రస్తుతం యువత తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. పదేళ్ల కిందట ఎలా ఉన్నాం.. ఇప్పుడెలా ఉన్నామని చెబుతూ ఫొటోలను షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఓ జంట (Couple) కూడా 15 ఏళ్లనాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంది. కాలేజ్ డేస్‌లో చేసిన డ్యాన్స్‌ను మళ్లీ ఇప్పుడు తమ పెళ్లిలో రిక్రియేట్ చేసి అందరినీ ఆకట్టుకుంది.
యష్ (Yash), గరిమా (Garima) మంచి స్నేహితులు. ఒకే కాలేజ్‌లో చదువుకున్నారు. వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే, సరిగ్గా 15 ఏళ్ల క్రితం వారు కాలేజ్‌లోని ఓ ఈవెంట్‌లో ‘యూ ఆర్ మై సోనియా’ (You Are My Soniya) పాటకు డ్యాన్స్ చేశారు. ఇప్పుడు తమ పెళ్లి వేడుకలో అదేపాటకు స్టెప్పులేయాలని అనుకున్నారు. అలా పెళ్లి వేదికపై అదే డ్యాన్స్‌ను రిక్రియేట్ చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియోని గరిమా ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. 2011లో కాలేజ్‌లో డ్యాన్స్ చేస్తున్న క్లిప్‌తోపాటూ పెళ్లి వేదికపై వధూవరుల దుస్తుల్లో అదేపాటకి డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను పంచుకున్నారు. “మా 15 ఏళ్ల స్నేహం. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యాం. నా ప్రాణ స్నేహితుడు, గొప్ప ప్రేమికుడు, నాసర్వస్వం అతడే. మేము 2011లో కాలేజ్ స్టేజ్‌పై చేసిన డ్యాన్స్‌ను పెళ్లి వేదికపై రిక్రియేట్ చేయాలనుకునే వాళ్లం. కానీ ఒక్కసారి కూడా ప్రాక్టీస్ చేయకుండానే ఇలా చేశాం. నేను డ్యాన్సర్‌నే. కానీ అతను కాదు. ప్రాక్టీస్ లేకపోవడం వల్ల స్టేజ్‌పై యష్ కొన్ని స్టెప్పులు మిస్ అయ్యాడు. అప్పుడు నాకు కొంచెం కోపం వచ్చింది” అంటూ గరిమా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లిలో ఇది మధురమైన జ్ఞాపకంలా మిగిలిపోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ జంట ఎలాంటి గొడవలూ లేకుండా ఇలాగే ముందు సాగాలని ఆకాంక్షిస్తున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Nagini Dance On Highway | అర్ధరాత్రి నడిరోడ్డుపై నాగిని డ్యాన్స్.. యువతులకు షాకిచ్చిన పోలీసులు
Mohanbabu University : మోహన్ బాబు యునివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram