Nagini Dance On Highway | అర్ధ‌రాత్రి న‌డిరోడ్డుపై నాగిని డ్యాన్స్‌.. యువ‌తుల‌కు షాకిచ్చిన పోలీసులు

కాన్పూర్‌-ల‌క్నో హైవేపై (Kanpur-Lucknow Highway) ఇద్ద‌రు యువ‌తులు అర్ధ‌రాత్రి న‌డిరోడ్డుపై నాగిని డ్యాన్స్‌తో రీల్స్ (Nagini Dance on Highway) చిత్రీక‌రించారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 24, 2026, 1:07 pm IST
Read Time: 5 mins
Nagini Dance On Highway | అర్ధ‌రాత్రి న‌డిరోడ్డుపై నాగిని డ్యాన్స్‌.. యువ‌తుల‌కు షాకిచ్చిన పోలీసులు

Nagini Dance on Highway | ప్ర‌స్తుతం రీల్స్ (Reels) ట్రెండ్ న‌డుస్తోంది. సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయ్యేందుకు యువ‌త ర‌క‌ర‌కాల ప్ర‌యత్నాలు చేస్తున్నారు. రీల్స్ చేస్తూ వాటిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. నెటిజ‌న్ల దృష్టిని ఆక‌ర్షించేందుకు కొత్త కొత్త ప్ర‌యోగాలు చేస్తున్నారు. తాజాగా ఇద్ద‌రు యువ‌తులు అర్ధ‌రాత్రి న‌డిరోడ్డుపై నాగిని డ్యాన్స్‌తో రీల్స్ (Nagini Dance on Highway) చిత్రీక‌రించారు.

హైవేపై నాగిని డాన్స్..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలోని కాజల్ గదన్ ఖేడా బైపాస్ సమీపంలో కాన్పూర్‌-ల‌క్నో హైవేపై (Kanpur-Lucknow Highway) రాత్రి స‌మ‌యంలో ఇద్ద‌రు యువతులు రోడ్డు మ‌ధ్య‌లో నాగిని డ్యాన్స్ చేస్తూ క‌నిపించారు. ఓ యువతి పామును ఆడించే వ్యక్తిలా నటిస్తుంటే, మరో యువతి ఏకంగా రోడ్డుపై దొర్లుతూ ‘నాగిని’ స్టెప్పులు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

నాగిని డాన్స్ ఎలా ఉంది..?

ఈ వీడియో చూసిన ఓ నెటిజ‌న్ ఉన్నావ్ పోలీసుల‌కు ట్యాగ్ చేశాడు. ‘సార్, ఈ నాగిని డాన్స్ ఎలా ఉంది? పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఇలాంటి వారు రోడ్ల మీదకు వస్తూనే ఉంటారు’ అంటూ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. ఇక‌ ఈ వీడియోపై యూపీ పోలీసులు సైతం సెటైరిక‌ల్‌గా స్పందించారు. ‘నాగిని స్టెప్పులు పర్ఫెక్ట్‌గా ఉన్నాయి.. కానీ లొకేషన్ మాత్రం ఫ్లాప్..!’ అంటూ పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

నెటిజ‌న్ల రియాక్ష‌న్‌..

ఇక ఈ వీడియోపై నెటిజ‌న్లు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మీకు రీల్స్ చేయ‌డానికి చోటే లేదా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. వాహనాలు అత్యంత వేగంగా ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ వేపై ఇలాంటి రీల్స్ చేయడం అవసరమా..? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మ‌రికొంద‌రైతే యువ‌తుల నాగిని డ్యాన్స్ సూప‌ర్ అంటూ చ‌మ‌త్క‌రిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Mohanbabu University : మోహన్ బాబు యునివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య
వచ్చే ఐదేళ్లలో 1.50 కోట్ల యాప్స్ మాయం..ఆ స్థానంలో ఏఐ ఏజెంట్లు