Mohanbabu University : మోహన్ బాబు యునివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య

తిరుపతిలోని ఎంబీయూ యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థిని భువన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Feb 24, 2026, 12:54 pm IST
Read Time: 4 mins
Mohanbabu University : మోహన్ బాబు యునివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య

అమరావతి : తిరుపతిలో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్వహిస్తున్న ఎంబీయూ(MBU) యూనివర్సిటీలో బీటెక్ డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ విద్యార్ధిని భువన(22) ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. తిరుమల పట్టణంలోని సాయితేజ ప్రైవేట్ లేడీస్ హాస్టల్‌లో ఉంటున్న ఆమె, సోమవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం గమనించిన హాస్టల్‌ సిబ్బంది వెంటనే ఆమెను నారావారిపల్లి హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతురాలు పుంగనూరు నియోజకవర్గం లోని మంగళంకు చెందిన విద్యార్థి అని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని చంద్రగిరి సీఐ సురేష్ కుమార్ తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు సంబందించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.

ఘటనపై హాస్టల్ యాజమాన్యం తల్లిదండ్రులకు ఆలస్యంగా సమాచారం అందించడం మరింత వివాదాస్పదంగా మారింది. హాస్టల్ వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ కూతురి ఆత్మహత్యపై న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంబీయూలో జరుగుతున్న అరాచకాలపై ప్రభుత్వం స్పందించాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మృతదేహంను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రూయ మార్చురికి తరలించారు. ఇటీవలే ఎంబీకే యూనివర్సిటీ నిర్వాహకుడు మోహన్ బాబుపై స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కిడ్నాప్ కేసు నమోదు కావడం వివాదస్పదం కావడం గమనార్హం.

విద్యార్థిని ఆత్మహత్యపై ఆమె తండ్రి సురేందర్ రెడ్డి స్పందించారు. తన కుమార్తె ఎందుకు బలవన్మరణానికి పాల్పడిందో తెలియడం లేదని..రూ. 17 లక్షల ప్యాకేజ్​ తో ఉద్యోగం వచ్చిందని .. తమ కష్టాలు తీరుతాయని అనే ఆనందంలో ఉండగా ఇలాంటి విషాద ఘటన జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. నాకు ఇద్దరు కుమార్తెలున్నారని మొదటి కుమార్తె భువన కాగా .. రెండో అమ్మాయి హర్షిత అదే కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతోందని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి :

Couple | 2011 కాలేజ్‌లో వేసిన‌ డ్యాన్స్‌ను పెళ్లిలో రిక్రియేట్ చేసిన జంట‌.. హృదయాన్ని హత్తుకునే వీడియో
Telangana Maoist free state| మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ !?