Harish Shankar | ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ రాజకీయ సందేహాలకు చెక్.. క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్
Harish Shankar | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. కమర్షియల్ హంగులతో పాటు పవన్ స్టైల్‌కు తగ్గ మాస్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘దేఖ్‌లేంగే సాలా’ సోషల్ మీడియాలో వైరల్ కాగా, తాజాగా వచ్చిన ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాటకు అభిమానుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తోంది.
Harish Shankar | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. కమర్షియల్ హంగులతో పాటు పవన్ స్టైల్‌కు తగ్గ మాస్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘దేఖ్‌లేంగే సాలా’ సోషల్ మీడియాలో వైరల్ కాగా, తాజాగా వచ్చిన ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాటకు అభిమానుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సాంగ్‌లో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఎనర్జీ, బీట్, లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అభిమానులు తమదైన స్టైల్లో ఎడిట్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో మూవీ టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.
ఇదిలా ఉంటే, సినిమాపై వినిపిస్తున్న రాజకీయ సందేహాలకు దర్శకుడు హరీష్ శంకర్ స్పష్టత ఇచ్చారు. సినిమా మొదలైన రోజు నుంచే పవన్ కళ్యాణ్ ఒక విషయం క్లియర్‌గా చెప్పారని, “సినిమా వేరు – రాజకీయాలు వేరు” అన్న సిద్ధాంతాన్ని పవన్ గట్టిగా పాటిస్తారని వెల్లడించారు. అదే మార్గంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూపొందించామని చెప్పారు. ఎవరినైనా లక్ష్యంగా చేసుకుని డైలాగులు పెట్టడం, రాజకీయ సెటైర్లు వేయడం ఈ చిత్రంలో ఎక్కడా ఉండదని హరీష్ స్పష్టం చేశారు. ప్రేక్షకుడికి పూర్తి వినోదం అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. సిద్ధాంత పరంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ నటుడు ప్రకాశ్ రాజ్‌తో పవన్ కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, పవన్ వ్యక్తిగతంగా ఎవరిపై దాడి చేయరని, ఆయన పోరాటం ఎప్పుడూ విధానాలపైనే ఉంటుందని వివరించారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’లో హీరో ఎలివేషన్ కోసం ఉండే మాస్ డైలాగులు మాత్రమే ఉంటాయని, ఎవరినీ చిన్నబుచ్చే మాటలు ఉండవని హామీ ఇచ్చారు. అభిమానులు కూడా రాజకీయ రిఫరెన్స్‌లు కాకుండా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటున్నారని తెలిపారు. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్‌కు వస్తున్న రెస్పాన్స్ తనకు ఎంతో సంతోషం కలిగించిందని, ఈ పాటను ‘ట్రాన్స్‌బస్టర్’గా పిలవొచ్చని హరీష్ పేర్కొన్నారు. మార్చి 26, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ మాస్ స్వాగ్, హరీష్ శంకర్ కమర్షియల్ టచ్ కలిసిన ఈ సినిమాపై రోజురోజుకీ హైప్ పెరుగుతుండగా, అభిమానులు థియేటర్లలో ఉత్సాహభరితమైన అనుభవం కోసం ఎదురుచూస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram