Warangal : వరంగల్ కమిషనరేట్ పరిధిలో పెరిగిన నేరాలు

వరంగల్ కమిషనరేట్ 2025 వార్షిక నివేదికను సీపీ సన్‌ప్రీత్ సింగ్ విడుదల చేశారు. నేరాలు 0.53% స్వల్పంగా పెరిగినప్పటికీ, పోలీసులు సమర్థవంతంగా నియంత్రిస్తున్నారని తెలిపారు. సైబర్ నేరాల్లో ₹12 కోట్లు పోగొట్టుకున్నట్లు వెల్లడించారు.

CP Sunpreet Singh

విధాత, ప్రత్యేక ప్రతినిధి: పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు 2024 కంటే ఈ ఏడాది నేరాలు ఎక్కువయ్యాయి. అయితే నియంత్రణలోనే నేరాలున్నట్లు పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. వార్షిక ప్రణాళిక సందర్భంగా సీపీ సన్ ప్రీత్ సింగ్ శనివారం వివరాలు వెల్లడించారు. గత ఏడాది 14,406 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 14,456 కేసులు నమోదయ్యాయి. హత్యలు 37 గత ఏడాది కాగా, ఈ ఏడాది 36 హత్య లు నమోదయ్యాయి. గత ఏడాది కిడ్నాప్ లు 183 ఉండగా ప్రస్తుత సంవత్సరం 148 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. దొంగతనం కేసులు గత ఏడాది 421 ఉండగా, ఈ ఏడాది 434 దొంగతనాలు జరిగాయి. అత్యాచారాలకు సంబంధించి గత ఏడాది 145 కేసులు నమోదు కాగా ప్రస్తుతం సంవత్సరంలో 132 కేసులు నమోదయ్యాయి. మహిళలపై నేరాలకు సంబంధించి గత ఏడాదితో పోలిస్తే 1504 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం కేవలం 1453 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

ప్రాణాలు తీస్తున్న రోడ్డు ప్రమాదాలు

కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 1,424 రోడ్డు ప్రమాదాల్లో 430 మంది దుర్మరణం చెందారు. 406 మంది తీవ్రంగా గాయపడగా, 1446 స్వల్ప గాయాలయ్యాయి. గత ఏడాది 1468 ప్రమాదాల్లో 459 మృతి చెందగా, ఈ ఏడాది 1424 ప్రమాదాల్లో 430 మంది మరణించారు. ఆపదలో ఉంటే ఠక్కున గుర్తుకు వచ్చేది డయల్ 100 నంబర్. ఈ నంబరు జనవరి నుంచి ఇప్పటి వరకు 54,252 మంది ఆపదలో ఉన్నామంటూ పోలీసులకు కాల్ చేశారు. మొత్తం 54,252 కాల్స్ రాగా, 44,898 కాల్సు వరంగల్ పోలీసులు అటెండ్ చేశారు. కాల్ వచ్చిన 5 నిమిషాల్లోనే వారి దగ్గరికి వెళ్లి వివరాలు సేకరించినట్లు వార్షిక ప్రణాళిక సందర్భంగా సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.అలాగే వరంగల్ కమిషనరేట్లో డ్రంక్, డ్రైవ్లో 35,513 మంది పోలీసులకు చిక్కారు. జనవరి నుంచి ఈరోజు వరకు పట్టుబడిన వారి నుంచి రూ.2.19 కోట్ల ఫైన్లు వసూలు చేయగా.. 887 మందికి జైలు శిక్ష పడింది. 329 మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు, రాంగ్ సైడ్ డ్రైవ్ 9,997, సెల్ మాట్లాడుతూ నడిపిన కేసులు 14,407, సిగ్నల్ జంప్ 13,024, లెసెన్సు లేకుండా నడిపిన వాళ్లు 97,020, హెల్మెట్ లేకుండా 9,04,287 తదితర కేసులు నమోదయ్యాయి.

వరంగల్లో కొత్తగా 45 రౌడీ షీట్లు

వరంగల్ పోలీస్ కమిషనరేట్లో కొత్తగా 45 మందిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. సెంట్రల్ జోన్లో 21, ఈస్ట్ జోన్లో 8, వెస్ట్ జోన్లో 16 మందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. మొత్తం కమిషనరేట్లో 719 మంది రౌడీషీటర్లు ఉన్నారు.

రూ.12 కోట్లు కొల్లగొట్టిన సైబర్ కేటుగాళ్లు

వరంగల్ కమిషనరేట్ పరిధిలో జరిగిన సైబర్ మోసాల్లో రూ.12.42 కోట్ల సోమ్మును కేటుగాళ్లు దోచుకున్నారు. పెట్టుబడి పేరుతో 34 కేసులు, పార్ట్ టైమ్ జాబ్ పేరుతో 92, OTP నంబర్తో 25, ఏపీకే ఫైలుతో 38, జాబ్ ఫ్రాడ్ పేరుతో 35, కస్టమర్ కేర్ పేరుతో 24, లోన్ పేరుతో 38, వ్యాపారాల పేరుతో 36, క్రెడిట్ కార్డు మోసం 308 కేసులు, మొత్తం 630 కేసుల్లో 12.42 కోట్లను కొల్లగొట్టారు.142 కేసుల్లో రూ.61 లక్షలను పోలీసులు రికవరీ చేశారు.

పెరిగిన పోక్సో కేసులు

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోక్సో కేసులు పెరిగాయి. అమ్మాయిలపై వేధింపులు గతేడాదితో పోలిస్తే కేసుల సంఖ్య పెరిగినట్లు పోలీస్ అధికారుల రిపోర్టు స్పష్టం చేస్తున్నాయి. 2024లో 364 కేసులు ఉండగా, 2025లో 405 కేసులు నమోదయ్యాయి. ఇదే క్రమంలో షీటీమ్స్ కేసుకు 2024లో 243 ఉండగా, 2025 వార్షిక సంవత్సరంలో 209 నమోదయ్యాయి.

నియంత్రణలో నేరాలు: వరంగల్‌ సీపీ సన్‌ ప్రీత్‌ సింగ్‌

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో నియంత్రణలో నేరాలు వున్నాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. శనివారం హనుమకొండలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వార్షిక నివేదిక ` 2025 సమావేశాన్ని ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు సంబంధించి నివేదికలోని వివరాలను వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే 0.53 శాతం స్వల్పంగా నేరాల పెరిగిందని గత ఏడాది 14,412 కేసులు నమోదు కాగా ప్రస్తుత సంవత్సరం 2025లో 14,456 కేసులు నమోదయ్యాయని వివరించారు.

ఇవి కూడా చదవండి :

Goa Zilla Panchayat Polls | మరో 14 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు.. ఆ రాష్ట్రం కాంగ్రెస్‌కు ఆశాజనకం!
Tummala Nageswara Rao : మంత్రి తుమ్మల పర్యటనకు అధికారుల డుమ్మా..సీరియస్ వార్నింగ్

Latest News