Weight Loss | ప్రస్తుతం చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. వెయిట్ గెయిన్ ఎన్నో అనర్థాలకు కారణమవుతోంది. బరువు తగ్గడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆహారంలో కీలక మార్పులు చేసుకుంటారు. అయితే, బరువు తగ్గడం అనేకి చాలా కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే బరువు పెరగడం చాలా ఈజీ.. కానీ తగ్గడం అంత సులువు కాదు. శారీరక శ్రమ అవసరం. అయినా అనుకున్న ఫలితాలు రావు. అందుకే బరువు తగ్గాలంటే కొందరు అదో యజ్ఞంగా భావిస్తుంటారు. వెయిట్ లాస్‌కు జిమ్‌ల చుట్టూ తిరుగుతుంటారు. వాకింగ్, జాగింగ్ అంటూ పార్కుల చుట్టూ తిరుగుతుంటారు. అయితే, ఓ మహిళ ఎలాంటి జిమ్‌లకూ వెళ్లకుండానే భారీగా బరువు తగ్గి అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
ట్యునీషియాలోని ట్యూనిస్‌కు (Tunis in Tunisia) చెందిన 22 ఏళ్ల హిబా అల్లా అయ్యాది (Hiba Allah Ayadi) అనే స్టూడెంట్ ఎత్తు 5 అడుగుల 8 అంగులాలు. కానీ ఆమె బరువు మాత్రం 133 కిలోలు. అధిక బరువుతో ఎన్నో బాధలు, అవమానాలు అనుభవించింది. అందుకే బరువు తగ్గాలని సంకల్పించింది. అలా కేవలం 11 నెలల్లోనే 52.42 కిలోల బరువు తగ్గింది. ప్రస్తుతం ఆమె బరువు 52 కిలోలు. అయితే, ఈ వెయిట్‌లాస్ జెర్నీలో ఆమె జిమ్‌కు వెళ్లకుండానే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. సహజ పద్ధతుల ద్వారానే ఆమె భారీగా బరువు తగ్గి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
ఈ జీవితం నాది కాదనిపించింది..
ఈ అధిక బరువు జర్నీ గురించి హిబా మాట్లాడుతూ.. “వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు స్కేల్‌పై 133.3 కిలోల బరువు కనిపించడం నాకు ఇప్పటికీ గుర్తుంది. అది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు.. అదొక రియాలిటీ చెక్. అధిక బరువు కారణంగా చిన్నచిన్న పనులు చేయడానికి కూడా ఎంతో అలసిపోయేదాన్ని. ఈ జీవితం నాది కాదనిపించింది. ఆ క్షణంలోనే అనుకున్నా బరువు తగ్గాలని. అందం, ఇతరుల కోసం కాదు.. నా ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడుకునేందుకు వెయిట్ లాస్ అవ్వాలని నిర్ణయించుకున్నా. గతంలా మారాలని సంకల్పించా” అని హిబా వివరించింది.
వెయిట్ లాస్ జర్నీ సాగిందిలా..
చాలా మంది బరువు తగ్గడం అంటే కడుపు మార్చుకోవడం అని అనుకుంటారు. కానీ హిబా అలా కాదు. కడుపునిండా తినేది. అయితే, ఆహారంలో మార్పులు చేసుకుంది. లైట్‌గా ఉండే ఫుడ్‌నే ప్రిఫర్ చేసేది. ఒక చిన్న బ్రెడ్ ముక్క, వెజిటెబుల్‌తో కూడిన ఎగ్ ఆమ్లెట్, వెజిటెబుల్స్ వంటివి టిఫిన్‌గా తీసుకునేది. అప్పుడప్పుడు కాఫీ, టీలు తాగేదీ. కానీ షుగర్‌ను పూర్తిగా అవాయిడ్ చేసేది. ఇక వాటర్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చేది. మధ్యాహ్నం భోజనం కూడా సమతుల్యంగా ఉండేలా చూసుకునేది. తక్కువ పరిణామంలోనే ఆహారం తీసుకునేది. ప్రోటీన్ కోసం చికెన్, గుడ్లను ఆహారంలో భాగంగా చేర్చుకునేది. ప్రతిరోజూ ఒక పండు తప్పనిసరిగా తినేలా డైట్ ప్లాన్ చేసుకుంది. ఆయిల్, సాల్ట్‌ను చాలా వరకూ తగ్గించింది.
నో జిమ్..
హిబా తన వెయిట్‌లాస్ జర్నీలో ఎప్పుడూ జిమ్ (Gym)కు వెళ్లలేదు. కేవలం నడకనే నమ్ముకుంది. వాకింగ్‌ను తన దైనందిన జీవితంలో భాగం చేసుకుంది. వీలుకుదిరినప్పుడల్లా వాకింగ్ చేసేది. ఇది ఆమె శరీరంలోని కేలరీలను కరిగించడమే కాకుండా.. మనసును ప్రశాంతంగా ఉంచేందుకు సాయపడింది. ఒక్కోసారి అలసిపోయేది. అయినా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. వాకింగ్‌నే అలవాటుగా మార్చుకుంది. అలా కేవలం 11 నెలల్లోనే 52.42 కిలోల బరువు తగ్గింది.
నచ్చిన బట్టలు వేసుకోలేకపోయేదాన్ని..
“అధిక బరువు అనేది అత్యంత బాధాకరమైన శారీరక శ్రమ మాత్రమే కాదు.. అదో మానసిక వేదన. నచ్చిన బట్టలు వేసుకోలేకపోయేదాన్ని. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నన్ను నేను చాలా మర్చుకోవాలన్న విషయాలే గుర్తుకొచ్చేవి. ఆరోగ్యం గురించి ఆందోళన ఉండేది” అంటూ హిబా తన బాధను పంచుకుంది. ఈ జర్నీలో తాను తీసుకున్న ప్రతీ నిర్ణయం నన్ను లక్ష్యానికి చేరువ చేసిందని ఇప్పుడు ఆమె గర్వంగా చెప్పుకుంటోంది. బరువు తగ్గడానికి కఠినమైన పద్ధతులు అవసరం లేదని.. కేవలం క్రమశిక్షణతోనే మనం అనుకున్నది సాధించగలమని హిబా నిరూపించింది.
ఇవి కూడా చదవండి :
Numaish Exhibition| నుమాయిష్ ఎగ్జిబిషన్.. పోకిరీల ఆటకట్టించిన షీటీమ్స్
Donald Trump| అపరేషన్ సిందూర్ ఆపకపోతే..పాక్ ప్రధాని చచ్చేవారు : ట్రంప్ కీలక వ్యాఖ్యలు
