Biker | ‘బైకర్’ కోసం 23 కేజీల బ‌రువు త‌గ్గిన శర్వానంద్ .. యాక్షన్ సీక్వెన్స్‌ల్లో ప‌లు ప్రమాదాలు

Biker | శర్వానంద్ హీరోగా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై ఆక్టేన్ రేసింగ్ డ్రామా బైకర్ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది.

  • By: Sandeep |    movies |    Published on : Mar 30, 2026 8:42 AM IST
Biker | ‘బైకర్’ కోసం 23 కేజీల బ‌రువు త‌గ్గిన శర్వానంద్ .. యాక్షన్ సీక్వెన్స్‌ల్లో ప‌లు ప్రమాదాలు

Biker | శర్వానంద్ హీరోగా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై ఆక్టేన్ రేసింగ్ డ్రామా బైకర్ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ఇండియన్ సినీ చరిత్రలో తొలి మోటోక్రాస్ అడ్వెంచర్ చిత్రంగా రూపొందిన ఈ మూవీ డాల్బీ, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో రిలీజ్ కానుండటం విశేషం.

ఈ సందర్భంగా దర్శకుడు అభిలాష్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం శర్వానంద్ చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి చెప్పిన వివరాలు హాట్ టాపిక్‌గా మారాయి. “కథ చెప్పినప్పుడే బైకర్ క్యారెక్టర్ ఇలా ఉండాలి అని నిర్ణయించుకున్నాం. దానికి తగ్గట్టుగా శర్వా ఏకంగా 23 కేజీలు తగ్గారు. ఆ పాత్రలో ఆయన పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇది ఆయన కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది” అని దర్శకుడు అన్నారు.

ప‌లు ప్ర‌మాదాలు జ‌రిగాయి..

సినిమాలో డా. రాజశేఖర్ పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. “శర్వానంద్ తండ్రిగా, కోచ్‌గా రాజశేఖర్ గారి పాత్ర కథకి కీలకం. తండ్రీ-కొడుకుల భావోద్వేగం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది” అని వివరించారు.

రేసింగ్ సీక్వెన్స్‌ల చిత్రీకరణలో ఎన్నో సవాళ్లు ఎదురైనట్లు దర్శకుడు చెప్పారు. “బైక్ రేసింగ్ అనేది చాలా రిస్క్‌తో కూడుకున్నది. రియల్ రేసర్స్‌తో షూటింగ్ చేయడంతో పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. ఒక షాట్ తర్వాత రెండు గంటల పాటు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చేది. కేవలం యాక్షన్ సన్నివేశాలకే 60 రోజులకు పైగా సమయం పట్టింది” అని తెలిపారు.

రేసింగ్ స్పోర్ట్స్‌కి గుర్తింపు లేదు..

ఈ సినిమా రెండు టైమ్‌లైన్స్‌లో సాగుతుందని, ముఖ్యంగా 90ల కాలంలోని టూ స్ట్రోక్ బైక్స్‌ను మళ్లీ డిజైన్ చేయడం పెద్ద సవాలుగా మారిందన్నారు. ఇండోనేషియాలో రేసింగ్ సన్నివేశాలను చిత్రీకరించామని, ఆ బైక్స్‌ను తిరిగి ఇండియాకు తీసుకురావడం కూడా క్లిష్టమైన ప్రక్రియగా మారిందని చెప్పారు. అలాగే న్యూజీలాండ్, ఆస్ట్రేలియా నుంచి రేసర్స్‌ను తీసుకువచ్చి షూటింగ్ నిర్వహించామని వెల్లడించారు.

ఇండియాలో రేసింగ్ స్పోర్ట్‌కు తగిన గుర్తింపు రాలేదని అభిలాష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. “మన దేశంలో ఈ స్పోర్ట్ చాలా కాలంగా ఉన్నా, క్రికెట్ లాగా పాపులారిటీ రాలేదు. ఈ అంశాన్ని సినిమాలో ప్రెజెంట్ చేశాం. కొంతవరకు నిజ జీవిత సంఘటనల నుంచి కూడా ప్రేరణ తీసుకున్నాం” అని తెలిపారు.

క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ, “ఇండోనేషియాలో క్లైమాక్స్ షూట్ చేశాం. ఆ లొకేషన్‌లో షూటింగ్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది. అంతర్జాతీయ సంస్థలు కూడా అనుమతించని పరిస్థితుల్లో మేమే ప్రత్యేకంగా సెట్ వేసి చిత్రీకరించాం. కథకు తగిన విధంగా అది చాలా స్పెషల్‌గా ఉంటుంది” అని చెప్పారు.

ప్రభాస్ మ‌ద్దతు…

సినిమాలో మాళవిక నాయర్ కీలక పాత్ర పోషించారని, ఆమెతో పాటు రాజశేఖర్ గారు కథ విన్న వెంటనే అంగీకరించారని తెలిపారు. నిర్మాతలు ఫస్ట్ కాపీ చూసి చాలా సంతృప్తిగా ఉన్నారని, సినిమా మీద మొత్తం టీమ్‌కు మంచి నమ్మకం ఉందన్నారు.

అదే విధంగా ప్రభాస్ తమ సినిమాకు మద్దతుగా ట్వీట్ చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. సంగీత దర్శకుడు జిబ్రాన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారని, ముఖ్యంగా చివరి 40 నిమిషాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని వెల్లడించారు.