Life style | మీ జీవిత భాగస్వామితో రోజూ ఆ పనిచేస్తే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే ఛాన్సే లేదట..!

Life style | శృంగారం, హస్త ప్రయోగంపై చాలా మందికి చాలా అపోహలుంటాయి. అతిగా శృంగారంలో పాల్గొంటే శారీర‌కంగా బ‌ల‌హీనమై పోతామ‌ని కొందరు భ‌య‌ప‌డుతుంటారు. ఎక్కువగా హస్త ప్రయోగం చేయడంవల్ల శృంగార ప‌టిమ తగ్గిపోతుందని మరికొందరు ఆందోళ‌న చెందుతుంటారు. కానీ, తాజాగా జ‌రిగిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటికి వ‌చ్చాయి.

  • Publish Date - May 26, 2024 / 08:38 AM IST

Life style : శృంగారం, హస్త ప్రయోగంపై చాలా మందికి చాలా అపోహలుంటాయి. అతిగా శృంగారంలో పాల్గొంటే శారీర‌కంగా బ‌ల‌హీనమై పోతామ‌ని కొందరు భ‌య‌ప‌డుతుంటారు. ఎక్కువగా హస్త ప్రయోగం చేయడంవల్ల శృంగార ప‌టిమ తగ్గిపోతుందని మరికొందరు ఆందోళ‌న చెందుతుంటారు. కానీ, తాజాగా జ‌రిగిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటికి వ‌చ్చాయి. హస్త ప్రయోగం ఎక్కువగా చేయడంవ‌ల్ల, తరచూ శృంగారంలో పాల్గొనడంవ‌ల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండ‌వ‌ని, పైగా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు త‌గ్గుతుంద‌ని తాజా అధ్యయ‌నంలో తేలింది.

వీలైనంత ఎక్కువ సార్లు అంగస్తంభన జరగ‌డంవ‌ల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు చాలా తగ్గుతుంద‌ని నూతన అధ్యయనంలో తేల్చారు. మొత్తం 32 వేల మంది పురుషులపై ఈ అధ్యయనం చేశారు. నెలలో ఏడు లేదా అంతకంటే తక్కువ సార్లు శృంగారం లేదా హస్తప్రయోగం చేసేవారితో పోలిస్తే.. 21 సార్లు శృంగారం లేదా హ‌స్తప్రయోగం చేసేవారిలో ప్రొస్టేట్‌ క్యాన్సర్ ముప్పు 19 శాతం తక్కువ ఉన్నట్లు గుర్తించారు.

అదేవిధంగా నాలుగు పదుల వయసులో ఉన్నవాళ్లు తరుచూ శృంగారం లేదా హస్తప్రయోగం చేస్తే ప్రొస్టేట్ ముప్పు 22 శాతం తక్కువగా ఉన్నట్లు క‌నిపెట్టారు. అయితే ఈ విష‌యంలో ఇదే మొదటి పరిశోధన కాదు. గ‌తంలో ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి అధ్యయనం జరిగింది. సగటున వారానికి 3 కంటే త‌క్కువ సార్లు హస్తప్రయోగం లేదా శృంగారంలో పాల్గొనే వారితో పోలిస్తే.. 7 సార్లు శృంగారం లేదా హ‌స్తప్రయోగం చేసే వాళ్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు 36 శాతం తక్కువ ఉందని ఆ అధ్యయ‌నంలో తేలింది.

అయితే అంగస్తంభనకు, ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పున‌కు మ‌ధ్య సంబంధంపై పలు అధ్యయనాలు జరిగినా ఇప్పటికీ సరైన ఆధారాలు లభ్యంకాలేదు. ఈ రెండింటికి లింకేంటి అనే దానిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజా పరిశోధన చేసిన శాస్త్రవేత్త జెన్నీఫ‌ర్ రైడర్ మాత్రం అంగస్తంభనకు, ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పున‌కు సంబంధం ఉందంటున్నారు. అంగస్తంభన ఫ్రీక్వెన్సీ అనేది పురుషుడి మొత్తం ఆరోగ్యానికి ఓ సూచిక అని ఆయన చెప్పారు. 50 ఏండ్ల లోపు వయసు ఉండి నెలలో కనీసం 3 సార్లయినా అంగస్తంభన జరగడంలేదంటే వారికి ప్రోస్టేట్ క్యాన్సర్ కాక‌పోయినా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంద‌ని తెలిపారు.

Latest News