Happy Teachers Day |
ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులను
మంచి మార్గంలో నడిపించే వ్యక్తి ఆచార్యులె
భావి భారత పౌరులగా తీర్చిదిద్దేది ఆచార్యులె
జ్ఞానవంతులయ్యేలా వెలుగు అక్షరాలు
విద్యార్థుల మదిలో నింపి దిక్సూచిలా గమ్యస్థానం వైపు నడిపిస్తారు
మబ్బులను తొలగించే సూర్యకిరణం తానయి నడిపిస్తారు
పసిడి జీవితాన్ని అక్షరాల లోకంలోకి చేర్చే బాటసారి
విద్యార్థుల భవిష్యత్తును అంచనా వేసి
బంగారు భవితకు బాటలు వేసే బాటసారి
సమాజం అవినీతి రహితంగా మారడానికి కృషిచేసే
కృషీవలుడు
శిష్యులకు వెలుగినివ్వడం కోసం తనను తాను అర్పించుకునే వ్యక్తి ఉపాధ్యాయుడు
తన జీవితంలో కొన్ని వేల మంది విద్యార్థుల
జీవితాలను తీర్చిదిద్దుతారు
తన జీవితంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి
అక్కడే అన్నట్లు అలాగే వుండిపోతారు
నేను ఒక ఉపాధ్యాయురాలుగా పనిచేసిన అనుభవంతో చెపుతున్నా ఏ గురువు గురుదక్షిణ అడగడు మీరు గొప్పవారు కావడమే మీరు మాకు ఇచ్చే నిజమైన గురుదక్షిణ.
ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
– రచన: మంజుల పత్తిపాటి
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
మొబైల్ నంబర్: 9347042218