విధాత: పిల్లలకు పాఠాలు బోధించి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పంతులమ్మలు పరస్పరం జుట్లు పట్టుకుని కొట్టుకున్న ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ – ఖర్గోన్ లోని ప్రభుత్వ ఏకలవ్య పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ దహియా, లైబ్రేరియన్ మధురాణిల మధ్య కొన్ని రోజులుగా డ్యూటీల విషయంలో విభేదాలు సాగుతున్నాయి. తాజాగా వారిద్దరి మధ్య మాటమాటా పెరిగి సహనం కోల్పోయి జుట్లు పట్టుకుని ఒకరినొకరు చెంపదెబ్బల దాడులు చేసుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో ఉన్నతాధికారులు ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించి, తాత్కాలికంగా అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. రెండు కొప్పులు కలిసి ఉండటం కష్టమేనన్న సామేత విద్యావంతులకైనా మినహాయింపులు కాదని..ఈ ఘటన నిరూపించిందంటున్నారు.
#vira #madhyapradesh pic.twitter.com/bmggmZH3bs
— srk (@srk9484) May 7, 2025