Site icon vidhaatha

Old Man Fighting: ఇతను ముసలోడేనా..పొట్టేలుతో ఫైటింగ్!

విధాత, హైదరాబాద్ : ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సామేత ఏమోగాని..ఈ వీడియో చేస్తే..ఆ ముసలాయన మాత్రం నేటి తరం యువతతో పోల్చితే బలాడ్యుడే అని చెప్పక తప్పదు. ఈ రోజుల్లో ఏ ఆహారం చూసిన కల్తీ మయం..ఇక పంటలైతే రసాయన మందుల వాడకంతో పండించినవే అంతటా వినియోగిస్తుంటారు. దీంతో నేటి తరం యువత త్వరగా తమ శక్తిని కోల్పోతు బలహీనపడుతున్నారు. కాని ఈ వీడియోలోని వృద్ధుడు మాత్రం ఏకంగా పొట్టేలుతో ఫైటింగ్ కు దిగి అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు. సాధారణంగా పొట్టేలు తలతో ఢీ కొడితే ఎద్దు ఢీ కొట్టినంత బలంగా ఉంటుందంటారు.

అలాంటిది..ఓ వృద్ధుడు పొట్టేలు తలతో ఢీ కొట్టించుకుంటూ బల ప్రదర్శనలు ఇస్తున్న తీరు వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వామ్మో ఈ ముసలాయన..ఐరన్ మ్యాన్ లా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఫిట్నెస్ అంటే ఇలా ఉండాలంటు ఆ వృద్ధుడిని ప్రశంసిస్తున్నారు.

 

Exit mobile version