Excise CI Attacks Attendant Wth Slippers: మద్యం అక్రమంగా విక్రయించే వ్యాపారుల వద్ధ నుంచి తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తావా అంటూ ఎక్సైజ్ సీఐ హసీనా బాను ఆఫీస్ అటెండర్‌ను చెప్పుతో కొట్టిన ఘటన వైరల్ గా మారింది. అనంతపురం కల్యాణ దుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా బాను ఎక్సైజ్ కార్యాలయం పరిధిలోని మద్యం అక్రమంగా విక్రయించే బెల్ట్ షాపు యజమానుల నుంచి ప్రని నెల మామూళ్లు వసూలు చేస్తున్నట్లగా ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆఫీస్ అటెండర్ నాని ఎక్సౌజ్ శాఖ ఉద్యోగుల సంఘానికి ఫిర్యాడు చేశారు. ఆ శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు సీఐతో మాట్లాడేందుకు ఆఫీస్ కు వచ్చారు. ఇదే సమయంలో అటెండర్ ను పిలిచిన సీఐ హసినా అతనిని దూషిస్తూ వారి ముందటే చెప్పుతో కొట్టింది.
మద్యం అక్రమంగా విక్రయించే వారి నుంచి నీవు డబ్బులు వసూలు చేసి నా పేరు చెబుతావా..నాపై ఆరోపణలు చేస్తావా అంటూ మండిపడింది. అటెండర్ ను సీఐ హసీనా చెప్పుతో కొట్టిన ఘటన చూసిన ఉద్యోగ సంఘాల నాయకులు ఖంగుతిన్నారు. గతంలోనూ ఆమె అక్రమాలు, అవినీతిపై ఉన్నతాధికారులు విచారణ చేసినా చర్యలు లేకుండా పోయాయని..ఆమె తన పనితీరు మార్చుకుంటే మంచిదంటూ వ్యాఖ్యానించారు.