Site icon vidhaatha

Viral | బస్సులో.. సీటు కోసం ఆడ,మగ తన్నులాట! వీడియో వైర‌ల్

విధాత: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో అమలు చేస్తున్న ఫ్రీ జర్నీ స్కీం పురుషులకు సంకటంగా మారింది. ఫ్రీ బస్సు కారణంగా బస్సుల్లో మహిళలు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. దీంతో తరుచు సీట్ల కోసం..ఇరుకు ప్రయాణంతో నెలకొన్న ఇబ్బందులతోనో మహిళల మధ్య సిగ పట్ల పంచాయితీలు సాధారణంగా మారియి. అదే సమయంలో మహిళలు బస్సుల్లో ఎక్కువగా ఎక్కెస్తుండటంతో పురుషులకు సీట్లు దొరకని పరిస్థితి వివాదస్పదమవుతోంది. డబ్బులిచ్చి బస్సు ఎక్కితే సీట్లు దొరకడం లేదని, మా సీట్లలోనూ అంతా మహిళలే కూర్చుంటున్నారని పురుష ప్రయాణికులు వాపోతున్నారు.

తాజాగా ఓ ఆర్టీసీ బస్సులో సీటు విషయమై నెలకొన్న గొడవలో ఓ వ్యక్తిని ఇద్దరు మహిళలు కలిసి కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేములవాడ-సిద్దిపేట మార్గంలో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సులో కొందరు మహిళలు, ఓ వ్యక్తికి మధ్య సీటు విషయంలో వివాదం ఏర్పడింది. మహిళలు అతడిని బూతులు తిట్టడంతో కోపోద్రిక్తుడైన వ్యక్తి వారి మీదకు దూసుకెళ్లాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ సాగగా.. మహిళలు అతడిని బస్సులోనే కింద పడేసి కొట్టారు.

పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కండక్టర్ కలగజేసుకుని ఆ ప్రయాణికుడిని బస్సులోంచి కిందకు దించివేశాడు. బస్సులో ఆడ, మగ మధ్య నెలకొన్న ఘర్షణ వీడియో చూసిన నెటిజన్లు.. మీ ఫ్రీ బస్సు తగలెయ్యా… దీంతో ఎవరికి గౌరవం లేకుండా పోతుందని మండి పడుతున్నారు. బస్సులో సీటు కోసం ఆడమగ కొట్టుకోవటం ఏంట్రా అయ్యా అని మరికొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండ‌గా బ‌స్సులో మ‌హిళ‌తో గొడ‌వ ప‌డిన వ్య‌క్తి అప్ప‌టికే బాగా తాగి ఉన్నాడ‌ని, ఆపై సీటు కావాలంటూ ప్ర‌యాణికుల‌తో వాదానికి దిగి మ‌హిళ‌ల‌ను ఇబ్బందికి గురి చేసిన‌ట్లు తెలిసింది.

Exit mobile version