మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టు వదలకుండా కృషి చేస్తే లక్ష్య సాధన సులభం అవుతుంది. కొన్ని అనుభవాలు గుణపాఠం నేర్పుతాయి. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా ప్రారంభిస్తారు. ఉన్నతాధికారుల నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పదోన్నతులకు అవకాశం ఉంది. అధికార యోగం ఉంది. ఆదాయం పెరుగుతుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్పష్టమైన నిర్ణయాలతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు అందుకుంటారు. ఒక శుభవార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అవివాహితులకు కళ్యాణయోగం ఉంది. ఆర్థికంగా ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున ప్రారంభించిన పనులన్నీ విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది. ఉన్నతాధికారులతో చేసే చర్చలు ఫలవంతంగా ఉంటాయి. వ్యాపారంలో నూతన అవకాశాలు ఎదురవుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కాలం అన్ని విధాలా సహకరిస్తోంది కాబట్టి అన్ని రంగాల్లో మేలైన ఫలితాలు రాబట్టడానికి సరైన సమయం. పెద్దల అనుభవాలు చక్కగా ఉపయోగపడతాయి.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శ్రేష్ఠమైన సమయం నడుస్తోంది. స్వల్ప ప్రయత్నంతోనే ఉద్యోగ వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలోపేరు ప్రఖ్యాతలు పొందడానికి అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ నెరవేరడంతో ఉత్సాహంగా ఉంటారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారులు కీలక ప్రాజెక్టులు దక్కించుకుంటారు. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి పరంగా ప్రయోజనం పొందుతారు.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. సంతానంకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు. కొన్ని సంఘటనలు బాధ కలిగించినా సహనం, ఓర్పుతో ఉంటే విజయం మీ సొంతం అవుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు వృత్తికి ఆటంకంగా మారుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోవద్దు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో తెలివిగా వ్యవహరిస్తే ప్రతికూలతలు తొలగుతాయి. బుద్ధిబలంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. శుభకార్యాల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో ఒక ఆహ్లాదకరమైన పర్యటనకు అవకాశం ఉంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవడం కష్టం అనిపిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ముందస్తు ప్రణాళికలు మేలు చేస్తాయి. చేపట్టిన పనులు వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో లౌక్యంగా నడుచుకోవాలి. అవనసరపు వ్యయాలు చేయకండి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిర్దేశించుకున్న లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తే ఆశించిన విజయం దక్కుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. వృత్తిపరమైన శుభవార్తలు కొత్త పనులు ప్రారంభించడానికి ఉత్సాహాన్నిస్తాయి. ప్రియమైన వారితో విహారయాత్రలకు వెళ్తారు. ఆర్థిక పరమైన లాభాలకు అవకాశం ఉంది.
