Davos WEF Viral Video | వివిధ దేశాధిపతులు, ప్రపంచంలోని అతి సంపన్న పెట్టుబడిదారులు వరల్డ్ ఎకనమిక్ ఫోరం పేరుతో ఒక్క చోట సమావేశమయ్యే స్థలమది! అదే దావోస్! స్విట్జర్లాండ్‌లోని సుందర పర్యాటక ప్రాంతం. ఈ ఏడాది వరల్డ్ ఎకనామిక్ ఫోరం (World Economic Forum – WEF) సమావేశాలు ప్రస్తుతం దావోస్‌లో కొనసాగుతున్నాయి. ట్రంప్ సహా వివిధ దేశాధిపతులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు సమావేశమవుతున్నారు. ఇదే సమయంలో దావోస్‌కు హై ప్రొఫైల్ ఎస్కార్ట్స్ (అత్యంత ఖరీదైన సె‘’ వర్కర్స్) సైతం పోటెత్తుతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి 2023 నాటి టిక్‌టాక్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రహస్య ఒప్పందాలపై (నాన్ డిస్క్లోజ్డ్ ఒప్పందాలు) సంతకాలు చేసి, ప్రముఖులకు పడక సుఖాన్ని పంచుతారంటూ చెబుతున్న ఒక పాత వీడియో అది. డెయిలీ మెయిల్ అప్పట్లో ప్రచురించిన ఒక కథనం ఆధారంగా ఆ సెటైరిక్ వీడియోను రూపొందించారు. దీంతో మరోసారి దావోస్‌లో ఏం జరుగుతూ ఉంటుందనే అంశాలపై చర్చ మొదలైంది.
ఆ వీడియోలో మహిళ చెబుతున్న దాని ప్రకారం.. దావోస్ సమావేశాలకు హాజరయ్యే ప్రముఖులకు ఒక్క రాత్రికి 2,500 డాలర్లు.. అంటే సుమారు రెండు లక్షల రూపాయలకు పైగా చార్జ్ చేసే ఎలైట్ ఎస్కార్ట్స్ ఉంటారట. వాళ్ల పేర్లు బయటకు రాకుండా.. Non-Disclosure Agreement (NDA)పై సంతకం చేస్తారని చెబుతున్నారు. ఈ వీడియోకు పెట్టిన క్యాప్షన్.. “Davos NDA decoded: The stump stays between the legs”. వాస్తవానికిదో డబుల్ మీనింగ్ సెటైర్. ఎన్డీయే అంటే.. Non-Disclosure Agreement అనీ అర్థం వస్తుంది. ఇది పక్కన పెడితే.. ఇది నిజమేనా? లేక కేవలం సెటైరేనా? అని గమనిస్తే.. ప్రధానంగా ఇది సెటైరిక్ వీడియోగానే కనిపిస్తున్నది. అదే సమయంలో ఒక కీలక అంశాన్ని కూడా వెల్లడిస్తున్నది.
దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు హై ప్రొఫైల్ పర్సనాలిటీలతోపాటు.. ఎస్కార్ట్‌లు కూడా పెద్ద సంఖ్యలోనే హాజరవుతారని కొన్ని వెబ్‌సైట్స్ కథనాల ఆధారంగా అర్థమవుతున్నది. డెయిలీ మెయిల్ 2023లో ఈ మేరకు Pr)stitutes gather in Davos for annual meeting of global elite… పేరిట ఒక కథనాన్ని కూడా పబ్లిష్ చేసింది. సదరు వీడియోలో ఉన్న మహిళ ఇదే కథనాన్ని తన వీడియోలో ప్రస్తావించింది. చూస్తే ఇది 2023 నాటి వీడియో అని అర్థమవుతున్నది. వాస్తవానికి ఇది పాత వీడియోనే అయినప్పటికీ.. దావోస్ సమావేశాల సమయంలో ఎస్కార్ట్స్‌కు భారీ డిమాండ్ ఉంటుందనే విషయాన్ని చాలా వెబ్‌సైట్స్ పేర్కొంటున్నాయి. పలు అంతర్జాతీయ మీడియాలు కూడా ఈ విషయాన్ని అనేకమార్లు ప్రచురించాయి. బ్రిటన్, స్విస్ మీడియా కథనాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ప్రతి ఏటా జరిగే సమావేశాల సమయంలో ఎస్కార్ట్ ఏజెన్సీలకు బుకింగ్స్ అమాంతం రెట్టింపు.. ఒకోసారి మూడింతలు కూడా పెరుగుతాయట.
2025 దావోస్ సమావేశాల సమయంలో ఈ సిటీకి సుమారు 300 మంది మహిళలు ఇదే పని నిమిత్తం వచ్చినట్టు కొన్ని రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. గతంలో ఉన్న అంచనాల ప్రకారం.. సమావేశాల సమయంలో కనీసం 100 మందికిపైగా అక్కడ ఉంటారట.
చార్జీల విషయంలో కొన్ని వెబ్‌సైట్స్ భిన్నంగా స్పందించాయి. వీడియోలో ఉన్న మహిళ డెయిలీ మెయిల్ కథనాన్ని ఉటంకిస్తూ.. ఒక్క రాత్రికి 2500 డాలర్లు చార్జ్ చేస్తారని పేర్కొంది. కొన్ని రిపోర్ట్స్ గంటకు 700 పౌండ్లను చార్జ్ చేస్తారని పేర్కొంటున్నాయి. డిమాండ్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు వెయ్యి నుంచి మూడు వేల డాలర్ల వరకూ వసూలు చేస్తారని తెలుస్తున్నది.
ఇక ఎన్డీయేల విషయానికి వస్తే.. ఈ సమావేశానికి హాజరయ్యేవారంతా బడా వ్యాపారవేత్తలు, హై ప్రొఫైల్ పొలిటీషియన్స్, సెలెబ్రిటీలు ఉంటారు. కాబట్టి.. వారి పేర్లు బయటకు రాకుండా ఎన్డీయే ఒప్పందాలు సర్వసాధారణమనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ఎన్డీయేలు దావోస్‌లోనే కాదని, ప్రపంచవ్యాప్తంగా ‘ఎలైట్ సర్వీసు’లలో సాధారణమేనని చెబుతున్నారు.
అయితే.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులు మాత్రం ఈ వార్తలను, ఊహాగానాలను కొట్టిపడేస్తున్నారు. ఎకనామిక్ ఫోరం సమావేశాలకు సుమారు 130 దేశాల నుంచి 3వేల మంది వరకూ ప్రతినిధులు హాజరవుతూ ఉంటారు. ఈ సమావేశాల్లో ఇటువంటి విషయాల్లో తాము జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తుంటామని ఫోరం అధికారంగా చెబుతున్నది. ఈ ఈవెంట్ సందర్భంగా అనైతిక కార్యకలాపాలు లేకుండా కఠిన నిబంధనలు ఉంటాయని పేర్కొంటున్నది. మొత్తంగా.. దావోస్ సమావేశాల సమయంలో ఎస్కార్ట్ డిమాండ్ పెరుగుతుందనేది వాస్తవమేనని పలు కథనాల ద్వారా తెలుస్తున్నది.
Read Also |
Ajay Banga | రానున్న 12-15 ఏళ్లలో… 400 మిలియన్ల ఉద్యోగాలకు 1.2 బిలియన్లు పోటీ : అజయ్ బంగా
Pawan Kalyan First Wife Nandini | పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఆమె ఇప్పుడు ఏం చేస్తోందంటే.. బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Amazon LayOffs | అమెజాన్‌లో మరోసారి భారీ స్థాయిలో లేఆఫ్స్.. కంపెనీ చరిత్రలోనే..!
