Indian Food At Davos : సమోసా నుంచి కిచిడీ వరకూ.. దావోస్‌ సదస్సులో ప్రపంచ నాయకులను ఆకర్షించిన ఇండియన్‌ ఫుడ్‌

దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో భారతీయ వంటకాలు ఘుమఘుమలాడాయి. సమోసా నుంచి కిచిడీ వరకూ ప్రపంచ నేతలను ఆకర్షించాయి.

Indian Food At Davos

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ (Davos) నగరంలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భారతీయ వంటకాలు ఘుమఘుమలాడాయి. డబ్ల్యూఈఎఫ్‌లో భారత్‌కు చెందిన అనేక లాంజ్‌లు, స్టాల్స్‌, పెవిలియన్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా అనేక భారతీయ వంటకాలను (Indian Food) ప్రపంచ నేతలు రుచి చూశారు. సమోసా (Samosa) నుంచి కిచిడీ (Khichdi) వరకూ భారతీయ వంటకాలు ఘుమాలించాయి.

కాంగ్రెస్‌ సెంటర్‌కు ప్రధాన వీధిలో ఉన్న లాంజ్‌ సమీపంలో టాటా గ్రూప్‌ చాయ్‌ సెంట్రల్‌ అనే టీ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. దానికి కొద్ది దూరంలోనే హెచ్‌సీఎల్‌ టెక్‌ టీ, కాఫీ కోసం ఓ స్టాల్‌ను తెరిచింది. మరో సంస్థ వేడి వేడి కిచిడీని అతిథులకు సర్వ్‌ చేసింది. వీటితోపాటూ బిర్యానీలు, వివిధ భారతీయ వంటకాలు ఆకట్టుకున్నాయి. స్కీ రిసార్ట్‌ పట్టణంలోని మంచుతో నిండిన దారుల గుండా ప్రపంచ నాయకులు నడుస్తూ.. మసాలా చాయ్‌, సమోసాలు, పకోడాలను ఆస్వాదించారు.

భారత్‌కు చెందిన కుమార్‌ ఇండియన్‌ ఫుడ్‌ తొలిసారి అక్కడ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. సమోసాలు, పకోడాలు, రైస్‌, రోటీలు, వివిధ శాఖాహార, మాంసాహార పదార్థాలను విక్రయించింది. ఈ స్టాల్‌లోని బిర్యానీలు మరెన్నో వంటకాలు అతిథులను ఆకర్షించాయి. ఆ ప్రాంతంలో ఈ ఫుడ్‌ స్టాల్‌ ఎక్కువ మందిని ఆకర్షించింది. ఫుడ్‌ ట్రక్కు వద్ద ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. వీటితోపాటూ మరికొన్ని సంస్థలు కూడా తమ స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ఆయా స్టాల్స్‌లో భారతీయ వంటకాలు స్వీట్స్‌, బిర్యానీ వాసన అతిథులను ఆకర్షించాయి.

ఇవి కూడా చదవండి :

Delhi Rains | ఢిల్లీలో వర్షం.. కశ్మీర్‌లో మంచు.. ఉత్తరాదిలో అకస్మాత్తుగా మారిన వాతావరణం
Vehicle Registration | నేటి నుంచి షోరూమ్ లోనే వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్స్

Latest News