న్యూఢిల్లీ : స్విట్జర్లాండ్ లో న్యూ ఇయర్ వేడుకల వేళ తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. క్రాన్స్ మోంటానా పట్టణంలోని ఓ బార్‌లో జరిగిన పేలుడు ఘటనలో 40మందికి పైగా మరణించారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 1.30 గంటలకు పేలుడు జరిగింది. పేలుడు ధాటికి బార్ అంతటా మంటలు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాద సమయంలో బార్‌లో 100 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. వారంతా తప్పించుకునే ప్రయత్నాలు చేసినప్పటికి..మంటల్లో చిక్కుకుని 40మంది మరణించారని..మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.
ఇవి కూడా చదవండి :
Chiranjeevi | శివాజి వివాదం.. పాతవన్నీ తవ్వుతున్న నెటిజన్స్, చిరుపై కూడా ఫైర్
Antarvedi Beach Accident : సముద్రంలోకి దూసుకెళ్లిన థార్..ఒకరి మృతి
